Bangalore Shocker: నీ భార్యను వీడియో కాల్‌లో చూపించవా అంటూ కత్తెరతో దాడి, బెంగళూరులో ఇద్దరు స్నేహితుల మధ్య వీడియో కాల్ వివాదం

బెంగళూరులో (Bangalore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియో కాల్ లో (Video call) తన భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని కత్తెరతో పొడిచి గాయపరిచాడు. సురేష్(56), రాజేశ్ మిశ్రాలు(49) టైలర్ కమ్ సేల్స్ మెన్లు. హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో ఉన్న ఓ దుస్తుల షాపులో వీరు పని చేస్తున్నారు. సురేశ్ హెచ్ఎస్ఆర్ లేఔట్ లో (HSR Layout), కోరమంగళ దగ్గర వెంకటాపురలో రాజేశ్ నివాసం ఉంటారు

Stabbed (file image)

Bangalore, FEB 02: బెంగళూరులో (Bangalore) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీడియో కాల్ లో (Video call) తన భార్యను చూపించలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన సహోద్యోగిని కత్తెరతో పొడిచి గాయపరిచాడు. సురేష్(56), రాజేశ్ మిశ్రాలు(49) టైలర్ కమ్ సేల్స్ మెన్లు. హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో ఉన్న ఓ దుస్తుల షాపులో వీరు పని చేస్తున్నారు. సురేశ్ హెచ్ఎస్ఆర్ లేఔట్ లో (HSR Layout), కోరమంగళ దగ్గర వెంకటాపురలో రాజేశ్ నివాసం ఉంటారు. కాగా, డ్యూటీలో ఉండగా.. రాజేశ్ మిశ్రాకు అతడి భార్య ఫోన్ కాల్ చేసింది. అతడు కాల్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో.. సురేశ్ (Suresh) అక్కడికి వచ్చాడు. రాజేశ్ కి (Rajesh) అడ్డు తగిలాడు. నీ భార్యను చూడాలని ఉంది. వీడియో కాల్ చేసి చూపించు అని అడిగాడు. అయితే, ఇందుకు రాజేశ్ ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

Andhra Pradesh Shocker: బాత్ రూంలో దూరి బాలికపై మేనమామ అత్యాచారం, అరుస్తుందని నోట్లో యాసిడ్ పోసిన కామాంధుడు, చికిత్స పొందుతూ బాలిక మృతి  

ఈ క్రమంలో సురేశ్ రెచ్చిపోయాడు. కత్తెరతో రాజేశ్ ను (stabbed by colleague) పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో గాయపడ్డ రాజేశ్ మిశ్రాను ఇతర సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై రాజేశ్ ఫిర్యాదుతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 324(ఉద్దేశపూర్వకంగా ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేసి గాయపరచడం), 504 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సురేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్ పై రిలీజ్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement