Nellore, Feb 1: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మేనమామ బాలిక పాలిట కామాంధుడు అయ్యాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు బాత్ రూంలో దూరగా తలుపులు పగలగొట్టి దారుణానికి ఒడిగట్టాడు. మేనమామ. బాలిక అరుస్తుందని నోట్లో బాత్ రూం కడిగే యాసిడ్ పోసి పరార్ అయ్యాడు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితురాలు (Acid attack victim) ఈ లోకాన్ని వీడింది. చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ (after 5 months of treatment) మంగళవారం ప్రాణాలొదిలింది.
వెంకటాచలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడికి కుమారుడు పుట్టి, 18 ఏళ్ల వయసులో మృతి చెందాడు. ఆ తర్వాత చాలా కాలానికి బాలిక పుట్టింది.ఆ బాలిక తన తల్లిదండ్రులతో ఉంటోంది. అయితే గతేడాది సెప్టెంబరు 5న కుటుంబసభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసిన ఆమె మేనమామ ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలు అతని నుండి తప్పించుకొని మరుగుదొడ్డి గదిలో దాక్కుంది.
ఆ కామాంధుడు తలుపులు పగలగొట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి బాధతో విలవిల్లాడింది.ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరు ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం చెన్నై తీసుకువెళ్లారు. అక్కడ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు పంచనామా, దర్యాప్తు నిమిత్తం బుధవారం చెన్నైకు వెళ్లనున్నారు.