Mumbai Horror: ముంబైలో దారుణం.. ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. మహిళను బెడ్ రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం..

సెంట్రల్ ముంబైలోని పోవై ప్రాంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్‌జెండర్‌నని నటిస్తూ ఒక నివాసంలోకి ప్రవేశించిన 28 ఏళ్ల వ్యక్తిని, మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై పోవై పోలీసులు అరెస్టు చేశారు.

Rape (photo-Rep)

Mumbai Horror: సెంట్రల్ ముంబైలోని పోవై ప్రాంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్‌జెండర్‌నని నటిస్తూ ఒక నివాసంలోకి ప్రవేశించిన 28 ఏళ్ల వ్యక్తిని, మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై పోవై పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడిని అనిల్ శేష్‌రావు షిండేగా పోలీసులు గుర్తించారు. అతడు ఆగస్టు 18న దిష్టి తీస్తాననే నెపంతో బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, పడకగదిలోకి వెళ్లి బాధితురాలిని బెదిరించి ఈ దాడికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం బాధితురాలి ఫిర్యాదుతో పోవై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వీడియో ఇదిగో.. బాలుడి ప్రైవేట్ పార్టును పట్టుకుంటూ రాపిడో రైడర్ లైంగిక వేధింపులు.. మైనర్ ఫిర్యాదుపై సంస్థ స్పందన ఏంటంటే..

బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించారు. చీర ధరించి ఉన్న నిందితుడు ఘటన అనంతరం థానే ఖరేగావ్‌లోని ఒక మురికివాడ వైపు ఆటోరిక్షాలో వెళ్లినట్లు గుర్తించి, గాలింపు చర్యలు చేపట్టి అతడిని అరెస్టు చేశారు. నిందితుడు బిచ్చగాడిలా, ట్రాన్స్‌జెండర్‌లా నటిస్తూ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంటాడని విచారణలో తేలింది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గుడ్డిగా నమ్మి గుర్తుతెలియని వ్యక్తులను, సాధువులు లేదా భిక్షాటన చేసేవారిని ఇళ్లలోకి అనుమతించవద్దని ప్రజలకు సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement