Sexually Assault | Representational Image (Photo Credits: File Image)

Andheri, June 9: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక ప‌ట్ల న‌లుగురు వ్య‌క్తులు క్రూర మృగాల్లా ప్ర‌వ‌ర్తించారు. కామం క‌లిగించే ఇంజెక్ష‌న్లు, ట్యాబెట్లు ఇచ్చి (16-Year-Old Girl Forcefully Injected With Aphrodisiacs) 8 ఏండ్లుగా అత్యాచారం చేస్తూ వ‌చ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ఇంటర్‌ చదువుతుండేది.

16 ఏళ్లు ఉన్న ఆ యువ‌తిని 8 ఏండ్ల క్రితం పొరుగింటి వారు కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆమె ఇంట‌ర్ చదువుతోంది. కిడ్నాప్ చేసిన త‌ర్వాత ఆ బాలిక‌కు కామోద్దీప‌నాలు క‌లిగించే ఇంజెక్ష‌న్లు ఇచ్చి కిడ్నాప్ చేసిన కామాంధుడు అత్యాచారం (Raped and Assaulted in Andheri) చేశాడు. ఈ పాడు ప‌నికి అత‌నికి భార్య కూడా స‌హ‌క‌రించింది. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా బెదిరింపులకు పాల్పడేవారు. ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని హెచ్చరించి ఆమెను నిర్బంధించారు. ఇలా 8 ఏళ్లుగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడుతున్నారు. దీనికి నిందితుడి భార్య కూడా సహకరించేది.

వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

దీంతో వారు పెట్టే హింస భ‌రించ‌లేక అంబోలి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మొత్తం 27 పేజీలతో ఆమె ఫిర్యాదు చేసింది. అయితే నిందితుల్లో ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి చేసేందుకు తనను ఉత్తరప్రదేశ్‌కు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. కేసు నమోదు అనంతరం పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టుబడ్డ వారిలో నిందితుడి భార్య కూడా ఉంది. ఆమె తన భర్తకు సహకరించింది. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది.

పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌పై అదేపనిగా అత్యాచారం, తరువాత అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు, నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌ దారుణం, ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు

బాలిక తప్పిపోయినప్పుడు ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయించారు. 8 ఏళ్ల తర్వాత తమ కూతురి ఆచూకీ లభించడంతో ఆమెను తల్లిదండ్రులు తీసుకెళ్లారు. నిందితులు బాధిత యువతి కుటుంబానికి తెలిసిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే పారిపోయినా, బ‌య‌ట‌కు విష‌యం చెప్పినా, త‌మ వ‌ద్ద వీడియోల‌ను బ‌య‌ట‌పెడుతామ‌ని బాలిక‌ను బెదిరించిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక మ‌రింత ఒత్తిడికి గురైంది.