stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Ongole, May 22: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. పదిహేడేళ్లు బాలుడు 63 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో. దీనికి సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు మండలం మల్లవరప్పాడుకు ( Ongole Mallavarappadu in Prakasam district) చెందిన నాగినేని రంగారావు అనే వ్యక్తి రొయ్యల చెరువుల వ్యాపారం చేస్తున్నాడు. అతని వద్ద రెండు నెలలుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ పని చేస్తున్నాడు. కాగా ఈనెల 14న రంగారావు తన మరొక తోట అయిన బొప్పాయితోటలో పని చేసేందుకు బాలుడిని పంపాడు.

అదే రోజు తోటలో రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) హత్యకు గురైంది. బొప్పాయి తోటలో పని చేసుకుంటున్న తన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ ఈనెల 15న రంగారావు టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఈ బాలుడి వ్యవహారం తెర పైకి వచ్చింది. కాగా 14వ తేదీన తోటకు వెళ్లి గేటు తీస్తున్న బాలుడితో అక్కడే కలుపుతీస్తున్న రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) గొడవ పడింది. అది కాస్తా తీవ్ర స్థాయిలో దూషణల వరకు వెళ్లింది.

పెళ్లి చేసుకుంటానంటూ మహిళా డాక్టర్‌పై అదేపనిగా అత్యాచారం, తరువాత అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులు, నాగ్‌పూర్‌లో ఐటీ కమిషనర్‌ దారుణం, ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు

దీంతో ఆగ్రహించిన బాలుడు తనను దూషించిన రవణమ్మను తోటలో ఉన్న దోకుడుపారతో తలపై బలంగా మోదాడు. అలాగే ఆమె వద్ద ఉన్న కండువాతో మెడకు బిగించాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు భావించి ఫెన్సింగ్‌ పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అంతటితో ఆగక ఆమెపై లైంగిక దాడికి (sexual assault of 63-year-old woman) కూడా పాల్పడ్డాడని పోలీసుల విచారణలో స్పష్టం చేశారు. బాలుడిని (Juvenile detained for murder) గురువారం మధ్యాహ్నం టంగుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్సై నాయబ్‌రసూల్‌ ఉన్నారు.