Nagpur, May 17: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వైద్యురాలిపై నాగ్‌పూర్ ఐటీ కమిషనర్ (Income Tax commissioner) పలుమార్లు లైంగిక దాడి చేశాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతారని బెదిరించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి నాగపూర్ ఆదాయ పన్నుశాఖ కమిషనర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో (Rape case registered against IT commissioner) నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరికి చెందిన నివాసి నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్‌లో (National Academy of Direct Taxes (NADT) శిక్షణ నిమిత్తం 2019లో నాగ్‌పూర్ వెళ్లాడు. ఈ క్రమంలో నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో (government hospital in Nagpur) చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో (woman doctor) ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు (UPSC examinations) సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
తరువాత స్నేహం పెంచుకొని ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో మహిళ అశ్లీల చిత్రాలు కూడా తీశాడు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. బాధితురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా నిందితుడిని బెంగళూరులో పోస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.