Mumbai Shocker: వీడు ఫ్రెండేనా..తన సెక్స్ కోరిక తీర్చలేదని ప్రాణస్నేహితుని తల పగలగొట్టేశాడు, ఎవరో చంపేశారని పోలీసులతో కట్టు కథ అల్లాడు

ప్రాణ స్నేహితుడే (Friend)తన స్నేహితుడిని అసహజమైన సెక్స్ కు ప్రేరేపించాడు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో బెస్ట్‌ఫ్రెండ్‌ తల బద్దలు కొట్టి (Man Arrested For Bludgeoning Friend To Death) చంపేశాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Mumbai, Oct 29: దేశంలో కామాంధులకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. వావి వరసలతో పాటు అసహజ శృంగారానికి పాల్పడుతున్నారు. అందుకు ఒప్పుకోకపోతే ఏకంగా చంపేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం చెరకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం (Rape) చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) బయటపడింది. ప్రాణ స్నేహితుడే (Friend)తన స్నేహితుడిని అసహజమైన సెక్స్ కు ప్రేరేపించాడు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో బెస్ట్‌ఫ్రెండ్‌ తల బద్దలు కొట్టి (Man Arrested For Bludgeoning Friend To Death) చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ మస్కే (27), రూపేష్ అలియాస్ రూప్‌సింగ్‌ (30) ఇద్దరూ మంచి స్నేహితులు. అక్టోబరు 22న రాత్రి పూట నవీముంబైలోని కరావే గ్రామంలో సమీపంలో కేంద్రియ విహార్‌ వద్ద ఆగి ఉన్న బస్సులో వారిద్దరూ ఉన్నారు.

ఇదేం పోయేకాలం..ఇద్దరు మగాళ్లను దారుణంగా రేప్ చేసిన కామాంధులు, కర్ణాటకలో దారుణ సంఘటనలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఆ సమయంలో ఇద్దరూ మత్తులో ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న విజయ్‌ తన వింత కోరిక బయటపెట్టాడు. తనతో శృంగారంలో పాల్గోవాలని రూపేష్‌పై ఒత్తిడి చేశాడు. దీనికి రూపేష్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న విజయ్‌.. రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌ వేయడానికి తీసుకొచ్చిన సిమెంట్‌ టైల్స్‌ తీసుకొని అతని తలపగలగొట్టి చంపాడు.

గే లే వారి టార్గెట్, సెక్స్ చేసుకుందామంటూ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి నిలువు దోపిడి చేయడమే వారి పని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన నోయిడా పోలీసులు

ఆ తర్వాత మత్తు దిగన తరువాత అర్ధరాత్రి జరిగిన ఘటనపై పోలీసులకు తెలియజేశాడు. తన స్నేహితుడిని ఎవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రూపేష్ గురించి మరింత సమాచారం కోసం విజయ్‌ను ప్రశ్నించే సమయంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అతనేదో దాస్తున్నాడనే అనుమానంతో గట్టిగా విచారణ చేయగా విజయ్‌ అసలు విషయం చెప్పాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

News Source Link

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement