
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది.రేపు జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. కాగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కాళ్లును మొక్కబోయాడు.
కథనం వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) , హార్దిక్ పాండ్యా(45) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. అయితే న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి కేన్ విలియమ్సన్ మాత్రం భారత్‌కు కొరకరాని కొయ్యగా మారాడు.
ఈ క్రమంలో విలియమ్సన్ ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అక్షర్ పటేల్.. విలియమ్సన్ పెవిలియన్ పంపాడు. కివీస్ ఇన్నింగ్స్ 41 ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. అద్బుతమైన బంతితో కేన్‌ను బోల్తా కొట్టించాడు.
Virat Kohli Touches Axar Patel's Feet
Kohli touching Axar Patel's feet after he got Williamson out 😭#Kohli #AxarPatel #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/mJmgQ95Y15
— Tarun Lulla (@ayotarun) March 2, 2025
అక్షర్ సంధించిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగ్గాఇ అంచనా వేయలేకపోయిన విలియమ్సన్ స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ విజయం లాంఛనమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి వేగంగా అక్షర్ వద్దకు వెళ్లి అతడు కాళ్లను టచ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్షర్ వెంటనే కిందకూర్చుని నవ్వుతూ కోహ్లిని ఆపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.