Noida Shocker: ప్రియుడితో జంప్ అయ్యేందుకు టీవీ సిరీస్ చూసి భారీ స్కెచ్‌, అచ్చం తనలాగే ఉన్న యువతిని హత్యచేసి తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించింది, నిజం ఎలా బయటపడిందంటే?

మృతదేహానికి తన దుస్తులు వేసి తనే ఆత్మహత్య (Sucide) చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో (Noida) ఈ సంఘటన జరిగింది.

Image used for representational purpose (Photo Credits: Pixabay)

Noida, DEC 02: సినిమాలు, సీరియళ్లను కేవలం వినోదం కోసం చూసేవాళ్లు చాలా మంది ఉంటారు. కొందరు అందులోని నటీ నటుల వస్త్రాలంకరణను అనుసరిస్తారు. కానీ మరికొందరు అందులోకి కుట్రలు, కుతంత్రాలను చూసి క్రైమ్‌ (Crime) చేస్తున్నారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. సీరియళ్లను (Serial) పారిపోయేందుకు తనలాగా పోలికలు ఉన్న మహిళను ఒక యువతి హత్య చేసింది. మృతదేహానికి తన దుస్తులు వేసి తనే ఆత్మహత్య (Sucide) చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో (Noida) ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల పాయల్‌ భాటి తండ్రి అప్పుల వేధింపుల వల్ల ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి మరణానికి సోదరుడు, అతడి భార్య తరుపు కుటుంబం కారణమని ఆమె ఆరోపించింది. వారిని కేసులో ఇరికించటంతో పాటూ తన ప్రియుడైన అజయ్ ఠాకూర్‌తో పారిపోయేందుకు ఒక ప్లాన్‌ వేసింది.

Delhi Shocker: రైలులో విండో పక్కన కూర్చుంటే ప్రాణాలే పోయాయి, కళ్ల మూసి తెరిచేలోపు ప్రయాణికుడి మెడలోకి దూసుకుపోయిన ఇనుపరాడ్, రక్తపు మడుగులో అలా కూర్చొనే మృతి చెందిన ప్రయాణికుడు 

గౌర్ సిటీ మాల్‌లో పని చేసే ఒక మహిళకు తనలాంటి పోలికలు ఉండటంతో ఆమెతో స్నేహం చేసింది. కాగా, నవంబర్‌ 12న పాయల్‌ భాటి ఆ మహిళను తన ఇంటికి తీసుకువచ్చింది. ప్రియుడు అజయ్‌తో కలిసి ఆమెను హత్య చేసింది. ఆమె మృతదేహానికి తన దుస్తులు తొడిగింది. గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆ మహిళ ముఖాన్ని కాల్చివేసింది. ‘నా ముఖం కాలిపోయింది, నాకు జీవించడం ఇష్టం లేదు’ అని సూసైడ్‌ లేఖను పాయల్‌ రాసింది. అనంతరం ప్రియుడు అజయ్‌తో కలిసి పారిపోయింది. అయితే పాయల్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు భావించిన బంధువులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Delhi: మహిళతో అభ్యంతరకర సీన్‌లో జడ్జి, ఆ వీడియో వైరల్ కాకుండా చూడాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వీడియోలో కనిపిస్తున్న మహిళ తరపున పిటిషన్ 

మరోవైపు మాల్‌లో పని చేసే మహిళ అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు పాయల్‌ భాటి, అజయ్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, అజయ్‌ను పెళ్లి చేసుకోవాలని పాయల్‌ భావించిందని ఆమె తాత తెలిపాడు. అయితే తన సోదరుడు ఒప్పుకోడన్న భయంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ఈ దారుణానికి పాల్పడిందని చెప్పాడు.