Odisha MLA Vehicle On Crowd: ఒడిశాలో మరో లఖీంపూర్ ఖేరీ తరహా ఘటన, ప్రజలపై దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, ఒకరు మృతి, 22 మందికి పైగా గాయాలు

ఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Image : Youtube

Odisha MLA vehicle On crowd: ఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. వారిని భువనేశ్వర్​ ఎయిమ్స్​కు తరలించారు.పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా.. ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్ బ్లాక్​ ఆఫీస్​ ముందు ఉన్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే కారుతో దూసుకెళ్లారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.

ఘటనా సమయంలో ఎమ్మెల్యే.. మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్​దేవ్​ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్​దేవ్​ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now