Online Fraud: ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి రూ 5 లక్షలకు పైగా పోగొట్టుకున్న ఓ వ్యక్తి, అసలు మోసం ఎలా జరిగిందంటే..

ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు.

Cyber Fraud. (Photo Credits: Pixabay)

న్యూఢిల్లీ, నవంబర్ 20 : ఉబెర్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసి దాదాపు రూ. 5 లక్షలకు పైగా ఒ వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఉబర్ డ్రైవర్ రూ.100 అదనంగా వసూలు చేయడం వల్ల ఈ ఫ్రాడ్ జరిగిందని బాధితుడు వాపోయాడు. గూగుల్ లిస్టెడ్ కస్టమర్ కేర్ నంబర్ ద్వారా సహాయం కోరినప్పుడు ఈ మోసానికి గురయ్యాడు. ఆశ్చర్యకరంగా, కనుగొనబడిన ఆ ఉబర్ నంబర్ నకిలీ అని తేలింది,

IANS కథనం,అలాగే నమోదైన FIR ప్రకారం, SJ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న ప్రదీప్ చౌదరి అనే బాధితుడు గురుగ్రామ్‌కు రూ. 205 తో క్యాబ్ బుక్ చేసుకున్నాడు.అయితే ఉబెర్ అతని నుండి రూ. 318 వసూలు చేసింది. అయితే దాని గురించి డ్రైవర్ ని అడగగా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మొత్తాన్ని తిరిగి వాపసు పొందండి అని తెలిపారు.

ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌, రూ.4 లక్షలు హాంఫట్, ఆర్డర్ క్యాన్సిల్ చేసే సమయంలో జాగ్రత్త, ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు

అయితే కస్టమర్ కేర్ నంబర్ తెలియకపోవడంతో గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో '6289339056' నంబర్‌ కనిపించడంతో దానికి కాల్ చేశాడు. అది '6294613240'కి మళ్లించబడింది, ఆపై '9832459993'లో రాకేష్ మిశ్రాకు మళ్లించబడింది. అతనితో మాట్లాడిన తరువాత Google Play Store నుండి 'రస్ట్ డెస్క్ యాప్'ని డౌన్‌లోడ్ చేయమని నన్ను ఆదేశించాడు. ఆ తర్వాత, అతను నాకు PayTM తెరిచి, రీఫండ్ అమౌంట్ కోసం 'rfnd 112' అని మెసేజ్ చేయమని అడిగాడు. నా ఫోన్ నంబర్ అందించడం గురించి ప్రశ్నించినప్పుడు ఇది ఖాతా ధృవీకరణ కోసం అని అతను చెప్పాడని కస్టమర్ తెలిపారు.

“ప్రారంభంలో, రూ. 83,760.. బాధితుడు అకౌంట్ నుంచి అతుల్ కుమార్‌ అనే వ్యక్తికి బదిలీ చేయబడింది, ఆ తర్వాత నాలుగు లక్షలు, రూ. 20,012, రూ. 49,101, వరుసగా ఇతర నాలుగు లావాదేవీలు జరిగాయి. ఫిర్యాదుదారు ప్రకారం మూడు లావాదేవీలు PayTM ద్వారా మరియు ఒకటి PNB బ్యాంక్ ద్వారా జరిగాయి. దీంతో మోసపోయిన బాధితడు పోలీసులను ఆశ్రయించాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66డి కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశామని, విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Crypto Currency Fraud: హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు.. పుదుచ్చేరిలో వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ,వేలాది నుండి డబ్బులు వసూలు

Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ

Advertisement
Advertisement
Share Now
Advertisement