Parliament Winter Session 2023: డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభ తేదీలపై (Parliament Winter session) క్లారీటి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్న మరసటి రోజు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు మొదలుకానున్నాయని సమాచారం.

Parliament Monsoon Session

New Delhi, Nov 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభ తేదీలపై (Parliament Winter session) క్లారీటి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్న మరసటి రోజు డిసెంబర్ 4 నుంచి సమావేశాలు మొదలుకానున్నాయని సమాచారం. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి పార్లమెంట్ సెషన్ ప్రారంభానికి ఒక రోజు డిసెంబర్ 3నే అఖిలపక్ష సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ అదే రోజున 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండడంతో డిసెంబర్ 2న సమావేశమవనున్నారు. కీలక బిల్లుల ఆమోదింపజేసుకోవాలని చూస్తున్న ఎన్డీఏ(NDA) సర్కార్‌పై 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపించవచ్చనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచే, బీఆర్‌ఎస్‌ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానివ్వమని తెలిపిన ప్రధాని మోదీ

హోమ్‌పై స్టాండింగ్ కమిటీ ఇప్పటికే మూడు నివేదికలను ఆమోదించినందున, ఐపీసీ(IPC), సీఆర్‌పీసీ(CrPC), ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో మూడు కీలక బిల్లులను ఈ సెషన్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కారణంగా పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఈ బిల్లుకి ఆమోదం లభించలేదు. ఈ బిల్లు కేబినెట్ హోదాతో సమానంగా CEC, ECల హోదాను మార్చాలని సూచిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement