PayCM Posters: కర్నాటక సీఎం అవినీతిపై కాంగ్రెస్ వినూత్న ప్రచారం, పేసీఎం అంటూ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు, ఏ పనిచేయాలన్నా 40శాతం కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ బెంగళూరులో పోస్టర్లు, సీఎంపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్

ర్నాట‌క‌లో (Karnataka) బీజేపీ అవినీతి పాల‌న‌పై 40 ప‌ర్సెంట్ స‌ర్కార్ (40% sarkar) అంటూ ప్రచారోద్యమం చేపట్టిన కాంగ్రెస్ మ‌రింత దూకుడు పెంచింది. సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై (Basavraj Bommai) ఫోటో, క్యూఆర్‌కోడ్‌తో “పేసీఎం”(PAYCM) అని ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్ బెంగ‌ళూర్ సిటీ (Bangalore) అంత‌టా ఏర్పాటు చేసింది.

Bangalore, SEP 21: క‌ర్నాట‌క‌లో (Karnataka) బీజేపీ అవినీతి పాల‌న‌పై 40 ప‌ర్సెంట్ స‌ర్కార్ (40% sarkar) అంటూ ప్రచారోద్యమం చేపట్టిన కాంగ్రెస్ మ‌రింత దూకుడు పెంచింది. సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై (Basavraj Bommai) ఫోటో, క్యూఆర్‌కోడ్‌తో “పేసీఎం”(PAYCM) అని ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్ బెంగ‌ళూర్ సిటీ (Bangalore) అంత‌టా ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ (QR Code)చేయ‌గానే యూజ‌ర్లను బీజేపీ అవినీతి పాల‌న‌పై ఫిర్యాదులు చేసేందుకు కాంగ్రెస్ ఇటీవ‌ల ఏర్పాటు చేసిన 40ప‌ర్సెంట్ స‌ర్కార వెబ్‌సైట్‌కు తీసుకువెళ్లేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుత‌ బీజేపీ (BJP) హ‌యాంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్న 40 శాతం కమిష‌న్ ముట్టజెప్పాల‌నే తీరును పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది.

బీజేపీ అవినీతి పాల‌న‌పై గ‌త వారం కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేప‌ట్టింది. అవినీతి పాల‌నపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ లాంఛ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం లూటీదారులు, స్కామ్‌స్టర్‌లతో నిండిపోయింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ నేత సిద్ధరామ‌య్య ఆరోపించారు. కాషాయ స‌ర్కార్ అవినీతిపై తాము ప్రశ్నిస్తూనే ఉంటామ‌ని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement