Pakistani 'Spy' Pigeon: సరిహద్దుల్లో అనుమానాస్పదంగా గూఢాచారి పావురం, పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా నిర్థారించిన కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా, ఆర్మీ అధికారులకు అప్పగింత

సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్ని (Suspected spy pigeon) కథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రకరకాల రంగుల్లో కనిపిస్తున్న ఈ పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. పాక్ వైపు నుంచి ఆ ప్రాంతంలోకి రావడం గమనించిన వారు.. దీన్ని పాక్ కొత్త ఎత్తుగడగా (Pakistani 'Spy' Pigeon) భావిస్తున్నారు. పావురాయి కాళ్లకి ఓ రింగ్ తొడిగి ఉందన్న విషయాన్ని కూడా వారు పోలీసుల దృష్టికి తెచ్చారు.

Pakistani 'Spy' Pigeon (Photo-ANI)

Jammu, May 25: సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్ని (Suspected spy pigeon) కథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రకరకాల రంగుల్లో కనిపిస్తున్న ఈ పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. పాక్ వైపు నుంచి ఆ ప్రాంతంలోకి రావడం గమనించిన వారు.. దీన్ని పాక్ కొత్త ఎత్తుగడగా (Pakistani 'Spy' Pigeon) భావిస్తున్నారు. పావురాయి కాళ్లకి ఓ రింగ్ తొడిగి ఉందన్న విషయాన్ని కూడా వారు పోలీసుల దృష్టికి తెచ్చారు. మిడతల దాడిపై అధికారులు అలర్ట్, వాటిని చంపేందుకు రంగం సిద్ధం, ఇవి పొలంపై వాలాయంటే అంతే సంగతులు

ఆ రింగ్‌పై ఉన్న గుర్తులను బట్టి భారత్‌కు సంబంధించిన వివరాలను గుట్టుచప్పుడు కాకుండా పాక్‌కు చేర్చేందుకే ఈ పావురాయికి శిక్షణ ఇచ్చి ఉంటారని స్థానికలు భావిస్తున్నారు. అయితే సరిహద్దు గుండా భారత్‌లోకి తీవ్రవాదులను పంపిద్దామని పాక్ విశ్వప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు దీనిపై ఎటువంటి అధికారికి ప్రకటన చేయనప్పటికీ అసలు ఈ పావురాయి కథ ఏమిటో తేల్చేందుకు వారు రంగంలోకి దిగారు.

Here's ANI Tweet

వివరాల్లోకి వెళ్తే.. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద ఒక పావురం కిందపడిపోయి కనిపించింది. వారు ఆ పావురాన్ని తీసుకెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పావురం పాకిస్థాన్‌ బోర్డర్‌ వైపు ఎగురుతూ కింద పడిపోయిందని మన్యారి గ్రామస్తులు తెలిపారు.

ఆ పావురాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాలుకు ఒక చిన్న రింగు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ రింగుపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా (Shailendra Mishra) నిర్ధారించారు. అనంతరం ఆ పావురాన్నిసంబంధిత ఆర్మీ అధికారులకు అప్పగించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now