Jaipur, May 25: కరోనా మహమ్మారితో తీవ్రంగా పోరాడుతున్న భారత్‌ను ఇప్పుడు మిడతల దాడి (Locust Swarm Attacks) వెంటాడుతోంది. భారత సరిహద్దులోని పంటలపై మిడతలు పెద్ద ఎత్తున దాడిచేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ శివారులో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర మిడతల దండు (Locust Swarm Attacks North India) కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మిడతల బుట్టతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, రైతుల గోడు పట్టించుకోవాలంటూ వినతి, మిడతలతో రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పంటలు నాశనం, రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అంటున్న రైతులు
రసాయనాలతో సిద్ధంగా ఉండాలంటూ అగ్నిమాపక సిబ్బందిని ఆదేశించారు. మిడతల సమూహం కనిపించడంతో అప్రమత్తమైన కలెక్టర్ ఆంద్ర వంశీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పంట పొలాలను, వృక్షాలను నాశనం చేస్తున్న మిడతల దండును చంపేందుకు రంగం సిద్ధం చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా యంత్రాంగం అగ్నిమాపక దళానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మిడతలు వ్యాపించాయి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవైన సమూహంతో ఉన్న ఈ మిడతల దండు ఒక్కసారిగా ఎగురుతూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి.
Take a Look at the Videos of Locust Attacks in India:
Noise and Crackers Scare Locusts Off in Jaipur
I know how this sounds- but we have just had a massive attack of LOCUSTS in Jaipur. Apparently noise and crackers scare them off. #infestation #Locusts #jaipur pic.twitter.com/PpZvOp6GXP
— Aparna Andhare (@arthysteriaa) May 25, 2020
Locust Attack in Jaipur
#Locusts swarm attack #Jaipur pic.twitter.com/l3Pt8rugF6
— Jitendra Soni (@jdsoni7) May 25, 2020
దీనిపై జిల్లా కలెక్టర్ ఆండ్రా వంశీ మాట్లాడుతూ.. మిడతలను (Locust)చంపే ప్రక్రియ గురించి గ్రామస్తులందరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాధారణంగా మిడతలు, పచ్చగడ్డి, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయన్నారు. అందువల్ల అవి తాము నివసించే ప్రదేశాల్లో, పొలాల్లో కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు పొడవైన సమూహంతో పెద్ద సంఖ్యలో మిడుతలు దేశంలోకి ప్రవేశించినట్లు తమకు వార్తలు అందినట్లు డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి తెలిపారు.
Locust Swarms Enter Madhya Pradesh
Madhya Pradesh: Locust swarms arrived in Malhargarh, Mandsaur district yesterday. Manoj Pushp, Mandsaur District Magistrate says, "Scientists from central locust team & agricultural science department conducted an exercise & removed around 60% of them by spraying". (24.05.20) pic.twitter.com/zcIuFpL5jL
— ANI (@ANI) May 24, 2020
మిడతల సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ నుంచి ఓ బృందం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ మిడుతల సహూహం ఝాన్సీలోని బాంద్రా మాగర్పూర్ వద్ద ఉందని, పురుగు మందుల పిచికారీ రాత్రి సమయంలో జరుగుతందని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ మిడతల దండు బంగ్రా మగార్‌పూర్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు.కాగా పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి.
ప్రస్తుతం రాజస్థాన్ లోని దౌసా జిల్లా వరకు (Rajasthan Tiddi Dal) చేరుకున్న ఈ రాకాసి మిడతలు ఆగ్రా సహా యూపీలో 17 జిల్లాలపై పెను ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. దాంతో, 204 ట్రాక్టర్లను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ద్వారా మిడతలపై రసాయనాలు పిచికారీ చేయాలని నిర్ణయించింది. కాగా, రెండ్రోజుల క్రితమే రాజస్థాన్ చేరుకున్న ఈ మిడతల గుంపు గాలి వ్యతిరేక దిశలో వీస్తుండడంతో చెల్లాచెదురయ్యాయి. దాంతో కొన్ని మధ్యప్రదేశ్ దిశగా వెళ్లాయి. అయితే, మరికొన్నిరోజుల్లో రాకాసి మిడతల ప్రభావం యూపీపై పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మిడతలు ఒక్కసారి పంట పొలంపై వాలాయంటే అక్కడ చూడ్డానికి ఏమీ మిగలదు. తమ పదునైన దవడలు, కాళ్లకు ఉన్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేస్తాయి. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి.