Jangaon: మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్, ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితులపై పోక్సో కేసు నమోదు

పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై.. ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా.. వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.

Child Rape Representative Image (Photo Credits: Pixabay)

Hyd, Oct 4: తెలంగాణలోని జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై.. ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక(14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నా.. వేర్వేరు కారణాలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు.

అయితే ఇద్దర హాస్టల్ నుండి పారిపోగా బస్టాండ్ సమీపంలోని ఓ పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని నాగరాజు అనే యువకుడికి ఫోన్ చేసింది.

ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్టాండు దగ్గరే మరో బాలిక ఒంటరిగా ఉండిపోవడాన్ని గమనించిన పాన్​షాప్ నిర్వాహకుడు సాయిదీప్...ఆశ్రయం కల్పిస్తానని పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. జనగామలోని హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌, గాయత్రి కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు, స్పందించని యాజమాన్యం

Here's Tweet:

ఆ బేకరీ నిర్వాహకుడు రాజు మరియు ఇతర స్నేహితులు అఖిల్, రోహిత్‌ హైదరాబాద్ తీసుకెళ్తామంటూ.. కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టారు. బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సైదాబాద్ పోలీసులు ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.



సంబంధిత వార్తలు