Prostitution Racket Busted: వ్యభిచార ముఠా గుట్టు రట్టు, ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలతో సహా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కలకలం

వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. కాగా, పోలీసుల దాడుల్లో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కావడం గమనార్హం.

Prostitution Racket Busted In Goa:

గోవా, మార్చి 20: మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. కాగా, పోలీసుల దాడుల్లో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన మహిళ కావడం గమనార్హం.

క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పక్కా సమాచారంలో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్స్‌ చేశారు. ఈ దాడుల్లో టీవీ నటితో సహా మరో ఇద్దరు మహిళలను పోలీసులు కాపాడారు. కాగా టీవీ నటి, మరో మహిళ ముంబై సమీపంలోని విరార్‌కు చెందిన వారు కాగా.. మూడో మహిళను హైదరాబాద్‌కు చెందినట్టు నిర్ధారించారు.

అరెస్ట్‌ చేసిన అనంతరం విచారణలో భాగంగా హఫీజ్ సయ్యద్ బిలాల్.. సదరు మహిళలకు బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపినట్టు తెలిపారు. కాగా , వీరికి రూ. 50వేలు చెల్లించడానికి కస్టమర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అయితే, నిందితుడు వారిని గురువారం అక్కడికి తీసుకువచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement