Punjab Blast: ట్రక్కులో బాణా సంచా పేలుడు, 15 మంది మృతి, పంజాబ్‌లో విషాద ఘటన, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స, ప్రకటన విడుదల చేసిన పంజాబ్ సీఎంఓ

పంజాబ్‌లో (Punjab)శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో (Punjab Blast) 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఎస్‌పీ Dhruv Dahiya స్పందించారు. అంత పెద్ద మొత్తంలో బాణాసంచాను ఎక్కడికి తరలిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా లేదా ఆరా తీస్తున్నారు.

Punjab: Blast Kills 14-15 People in Tarn Taran, 20 Injured |Image used for representative purpose. (Photo Credits: IANS)

Chandigarh, February 9: పంజాబ్‌లో (Punjab)శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో (Punjab Blast) 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఎస్‌పీ Dhruv Dahiya స్పందించారు. అంత పెద్ద మొత్తంలో బాణాసంచాను ఎక్కడికి తరలిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా లేదా ఆరా తీస్తున్నారు.  కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఈ ఘటన ఏ విధంగా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. టార్న్ తరణ్ (Tarn Taran Explosion) వద్ద మధ్యాహ్నం ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాణా సంచా తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

CM Capt.Amarinder Singh Tweet

మృతులంతా పంజాబ్ వాసులేనని తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు ఎక్కువ మంది ట్రాలీలో ఉండటం, బాణా సంచా పేలుడు తీవ్ర కూడా అధికమొత్తంలో ఉండటంతో పేలుడు ధాటికి 15 మంది ఒక్కసారిగా అక్కడికక్కడే మృతి చెందారు.

పంజాబ్‌లో ఘోర ప్రమాదం, కుప్పకూలిన మూడంతస్తుల భవనం

గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. నిజంగా బాణా సంచా, లేదా ఏదైనా పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Tweet

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (CM Amarinder Singh) స్పందించారు. చనిపోయిన వారికి తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) రూ .5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. "ఈ రోజు తార్న్ తరణ్ లోని నాగర్ కీర్తన్ సందర్భంగా ట్రాలీలో బాణసంచా పేలుడుపై మెజిస్టీరియల్ దర్యాప్తుకు సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశించారు. మరణించిన వారి బంధువులకు 5 లక్షల రూపాయల ఎక్స్-గ్రేటియా గ్రాంట్ మరియు గాయపడినవారికి ఉచిత చికిత్సను ప్రకటించారు" అని పంజాబ్ సిఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Robin Uthappa: వీడియో ఇదిగో, యువరాజ్ సింగ్ కెరీర్‌ ముగియడానికి కారణం విరాట్ కోహ్లీనే, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్‌ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం

Share Now