Meta removes BJP MLA Raja Singh Facebook and Instagram accounts(X)

Hyd, Feb 21:  తెలంగాణ బీజేపీ నేత, గోషా మహల్(Goshamahal MLA ) ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చింది మెటా(Meta Removes Raja Singh Accounts). సోషల్‌ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్‌ ల్యాబ్‌ (IHL) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. రాజాసింగ్‌ పేరుతో ఉన్న రెండు ఫేస్‌బుక్, మూడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించింది.

రాజాసింగ్‌కు ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో(BJP MLA Raja Singh) సుమారు 10 లక్షల మందికిపైగా సభ్యులు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా 55 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిపై రాజాసింగ్ తనదైన శైలీలో స్పందించారు.

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. తీరు మార్చుకోకపోతే హైడ్రాను మూసేస్తామని హెచ్చరిక, మీరెమన్న దోపిడి దొంగలా? అని మండిపాటు 

రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేసిన ఫిర్యాదు ఆధారంగా తన అకౌంట్లను తొలగించారని మండిపడ్డారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్‌ సెన్సార్‌షిప్‌ దాడి చేస్తోంది. నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేయడం దురదృష్టకరం అన్నారు.

Meta removes BJP MLA Raja Singh Facebook and Instagram accounts

ఐహెచ్‌ఎల్(India Hate Lab) నివేదిక ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య బీజేపీ సీనియర్ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని వెల్లడించింది. ముఖ్యంగా రాజాసింగ్ ప్రసంగాలు ద్వేషపూరితమని ప్రధానంగా ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రసంగాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంంది మెటా.