Rafale Jets Entry Video: అదుర్స్ అనిపించేలా రాఫెల్ జెట్స్ ఎంట్రీ వీడియో, సుఖోయ్ ఫైటర్స్‌ని తోడు తీసుకుని వస్తున్నరాఫెల్ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగనున్నాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి భారత్ చేరుకున్నాయి. ఇందులో రెండు శిక్షణ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. మార్గమధ్యలో యూఏఈలో అల్‌దఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇవి ఇంధనం నింపుకున్నాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాఫెల్ జెట్ల వీడియోను Defence Minister’s office (RMO) షేర్ చేసింది.

Rafale fighter jets entering the Indian Airspace (Photo Credits: ANI)

Ambala. July 29: ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు మరికాసేపట్లో హర్యానాలోని అంబాలా వాయుసేన బేస్‌లో దిగనున్నాయి. దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి భారత్ చేరుకున్నాయి. ఇందులో రెండు శిక్షణ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. మార్గమధ్యలో యూఏఈలో అల్‌దఫ్రా ఎయిర్‌బేస్‌లో ఇవి ఇంధనం నింపుకున్నాయి. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాఫెల్ జెట్ల వీడియోను Defence Minister’s office (RMO) షేర్ చేసింది. రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా

ఈ వీడియోలో భారత గగనతలంలోకి ప్రవేశించిన రాఫెల్‌ విమానాలకు రక్షణగా రెండు సుఖోయ్(SU30 MKI)‌ జెట్స్‌ తోడుగా ఉన్నాయి. ఇవి ముంబై మీదుగా అంబాలా ఎయిర్‌బేస్‌కు వస్తున్నాయి. శుత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్థ్యం వీటి సొంతం. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ప్రస్తుతం ఐదు యుద్ధవిమానాలు అంబాలా చేరుకోనున్నాయి. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ (Ambala airbase) వద్ద రాఫెల్ ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' (Water Salute ) ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా నిర్వహించనున్నారు. వీటిని రిసీవ్ చేసుకోవడానికి వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా (IAF chief Air Chief Marshal RKS Bhadauria) అంబాలాలో ఉన్నారు.

Video of Rafale Jets Entering the Indian Airspace: 

చైనా స్వయంగా తయారు చేసుకున్న చెంగ్డూ జే-20, చైనాలో తయారై పాక్‌ వాయుసేనకు చేరిన జేఎఫ్‌-17తో పోలిస్తే రాఫెల్‌ పలు విషయాల్లో మెరుగైనదని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఈ విమానాలను లఢఖ్‌ సెక్టార్‌లో మోహరించనున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: కుల గణన సర్వే విజయవంతం.. అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని కితాబు

India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్‌ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

PM Modi Slams Kejriwal: ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, యమునా నదిలో విషం కలుస్తోందన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన నరేంద్ర మోదీ

Share Now