Rafale Fighters: రాఫెల్‌కు వాటర్ సెల్యూట్, అంబాలా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ కానున్న రాఫెల్‌ యుద్ధ విమానాలు, రిసీవ్ చేసుకునేందుకు అంబాలా చేరుకున్న వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా
Rafale Fighter Jet. (Photo Credits: Twitter)

Ambala, July 29: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు (Rafale Fighter Aircrafts) కాస్సేపట్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ఇవి ల్యాండ్ కాబోతున్నాయి. రాఫెల్‌ ల్యాండింగ్ కోసం భారత్ ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ రోజు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ (Ambala airbase) వద్ద రఫాలే ల్యాండ్ అయిన తరువాత ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు 'వాటర్ సెల్యూట్' (Water Salute ) ఇవ్వబడుతుంది. రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చేశాయి, 2021లోపు భారత్‌కు రానున్న 36 విమానాలు, గాలిలో ఇంధనాన్ని నింపుకుని 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం

ఈ కార్యక్రమాన్ని ఎయిర్‌బేస్‌లో వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా నిర్వహించనున్నారు. మొదటగా ఐదు రాఫెల్ జెట్లు (Rafale Fighters) అంబాలా ఎయిర్‌బేస్‌కు రానున్నాయి. వీటిని రిసీవ్ చేసుకోవడానికి వైమానిక దళం చీఫ్ ఆర్కెఎస్ భదౌరియా (IAF chief Air Chief Marshal RKS Bhadauria) అంబాలాలో ఉన్నారు.

Update By ANI

భారత వైమానిక దళ ఫైటర్ పైలట్లు 7000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత అంబాలా ఎయిర్ బేస్ చేరుకుంటున్నారు. 17 గోల్డెన్ ఆరోస్ కమాండింగ్ ఆఫీసర్ పైలట్లతో విమానాలను తీసుకువస్తున్నారు. కాగా ఇప్పటికే పైలట్లకు ఫ్రెంచ్ దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ పూర్తి శిక్షణ ఇచ్చింది. ఐదవ తరం ఫైటర్ జెట్ పోరాట సామర్థ్యాన్ని ఎదుర్కోవడం చైనా అలాగే, పొరుగు దేశం పాకిస్తాన్ వల్ల కానీ పని అని నిపుణులు చెబుతున్నారు. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం బలం మరింతగా రెట్టింపు కానుంది.

దాదాపు రెండు దశాబ్దాల తరువాత, భారతదేశం కొత్త మల్టీరోల్ విదేశీ యుద్ధ విమానాలను ప్రవేశపెడుతుంది. కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడంలో జాప్యం దృష్ట్యా పలు ఆదేశాల తరువాత రష్యాకు చెందిన సుఖోయ్ -30 లు చివరిసారిగా వైమానిక దళంలో ప్రవేశించాయి. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఐదుగురు రాఫెల్ విమానాలు అంబాలాకు చేరుకోనున్నట్లు ఐఎఎఫ్ వర్గాలు తెలిపాయి.

Here's India in France Tweet

60,000 కోట్ల రూపాయల రక్షణ ఒప్పందానికి, భారత చర్చల బృందానికి ఇన్‌చార్జిగా ఈ విమానాలను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఐఎఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఈ విమానానాలను స్వీకరిస్తారు. ఇండియా ఇప్పటివరకు సంతకం చేసిన అతిపెద్ద డీల్ ఇదే.. దశాబ్దాలుగా సరిహద్దుల్లో రావణకాష్టాన్ని రగిలిస్తున్న పాకిస్థాన్‌కు, ఇటీవలి కాలంలో తరచూ కయ్యానికి దిగుతున్న చైనాకూ.. ఏకకాలంలో బుద్ధిచెప్పగల సైనిక సామర్థ్యాన్ని రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లతో భారత్‌ సంతరించుకోనున్నది.

పూర్తిస్థాయిలో రాఫెల్ జెట్స్‌ను ఆగస్ట్ 20న ఎయిర్‌ఫోర్స్‌లోకి ప్రవేశ పెడతారు. ఫ్రాన్స్‌నుంచి రాఫెల్‌ విమానాల రాక నేపథ్యంలో అంబాలాలోని వైమానిక స్థావరం పరిసర ప్రాంతాల్లో మంగళవారం నిషేధాజ్ఞలు విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫొటోలు, వీడియోలు తీయటాన్ని నిషేధించారు. వైమానిక స్థావరానికి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేటు డ్రోన్లను అనుమతించబోమని అంబాలా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఎయిర్‌బేస్‌ చుట్టుపక్కల గ్రామాల్లో నలుగురికంటే ఎక్కువమంది గుమికూడకుండా 144వ సెక్షన్‌ విధించినట్టు డిప్యూటీ కమిషనర్‌ అశోక్‌శర్మ తెలిపారు.

30వేల అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. భారత్‌కు పయనమైన రఫేల్ విమానాలకు ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ చేసిన సహాయానికి అభినందనలు అంటూ ఆ ఫొటోలను ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలను రూ. 59,000 కోట్లకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2021 వరకు మొత్తం యుద్ధ విమానాలు భారత్ చేరుకోనున్నాయి. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు లడఖ్ ప్రాంతంలో మోహరించే అవకాశం ఉంది.

ట్విన్ ఇంజిన్స్‌ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఙానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్‌ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు.

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. ఈ విషయం ఇప్పటికే రుజువైంది కూడా. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ విండర్, అపాచి, హర్పూర్, అలారం, పీజీఎం 100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు.

రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. ఇలాంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.