Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం, నేడు సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) రేపు అంటే గురువారం సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో పేరిట సాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్రపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు.

Rahul Gandhi (Photo Credits: Instagram)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) రేపు అంటే గురువారం సాయంత్రం 5.30 నిమిషాలకు సోనియా అధ్యక్షతన సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో పేరిట సాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్రపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. అంతకు ముందు అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 7కు మార్చారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం అయింది. దేశ వ్యాప్తంగా మొత్తం 3571 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర సాగనుంది. మొత్తం 148 రోజుల పాటు 68 లోక్ సభ నియోజకవర్గాల్లో 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. ఏపీలో మొత్తం 100 కిలోమీటర్ల మేర..4 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగనుంది. ఏపీలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగుతుంది.

కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ఆలూరు, తెలంగాణలోని వికారాబాద్ గుండా జమ్మూ వరకు 20 ప్రధాన నగరాలు, పట్టణాలు గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది. అలాగే సీడబ్ల్యుసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు అధిక ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న ఢిల్లీలో రాంలీలా మైదానంలో నిర్వహించబోతోన్న ర్యాలీ గురించి కూడా చర్చించనున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement