Rajasthan Shocker: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కక్ష, అల్లుడిని కిడ్నాప్‌ చేసి ముక్కు కోసిన అత్తింటి వాళ్లు, రాజస్థాన్‌లో దారుణ ఘటన

ఆ ఇంటి ఆడబిడ్డ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రేమ వివాహం ఆ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు. పెళ్లి వద్దని చెబితే ఆమె వినిపించుకోలేదు. తనకు అతడే కావాలని పట్టుబట్టి పెళ్లిచేసుకుంది.

Crime | Representational Image (Photo Credits: Pixabay)

Ajmer, Mar 20: రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అల్లుడిపై కక్షగట్టిన అత్తింటివాళ్లు అతన్ని కిడ్నాప్ చేసి ముక్కు కోశారు. దీనికి కారణం ఆ ఇంటి ఆడబిడ్డ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రేమ వివాహం ఆ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు. పెళ్లి వద్దని చెబితే ఆమె వినిపించుకోలేదు. తనకు అతడే కావాలని పట్టుబట్టి పెళ్లిచేసుకుంది.

సంగారెడ్డి జిల్లాలో దారుణం, భార్యను గొడ్డలితో నరికి అనంతరం ఉరి వేసుకున్న భర్త, మరో ఘటనలో రంగారెడ్డి జిల్లాలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

దాంతో అల్లుడిపై అత్తింటివాళ్లు కక్ష కట్టారు. అల్లుడికి తగిన శాస్తి చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. అజ్మీర్‌ జిల్లాలో కాపురం ఉంటున్న వాళ్ల ఇంటికి వెళ్లి అల్లుడిని కిడ్నాప్‌ చేశారు. అక్కడి నుంచి నాగౌర్‌ జిల్లాలోని వారి స్వగ్రామానికి అతడిని తీసుకెళ్లారు. అక్కడ అల్లుడి ముక్కు కోసి విడిచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన బాధ్యులైన నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement