Ram Mandir Bomb Threat: సీఎం యోగీని, అయోధ్య రామమందిరాన్ని బాంబులతో పేల్చేస్తాం, అగంతకుల నుంచి బెదిరింపు పోస్టు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

అయోధ్యలో నిర్మించిన రామ మందిరంతో సహా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.

Ram Mandir (File Image)

అయోధ్యలో నిర్మించిన రామ మందిరంతో సహా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)ను బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కొద్ది రోజుల్లో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న వేళ ఇవి కలకలం రేపుతున్నాయి. కాగా ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డ్ వీడియో ఇదిగో, శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్

యూపీ పోలీసుల కథనం ప్రకారం.. నిందితులిద్దరూ పేలుళ్లకు పాల్పడతామని సోషల్‌మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సీఎంతో పాటు ఎస్‌టీఎఫ్‌ చీఫ్‌ అమితాబ్‌ యశ్‌ను కూడా దారుణంగా హత్య చేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సోషల్ మీడియా పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్‌ అడ్రస్‌లను కనుగొన్నారు. నిందితులను ఓం ప్రకాశ్‌, తాహర్ సింగ్‌లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని తెలిపారు. తాహర్‌ సింగ్‌ మొయిల్స్‌ను సృష్టించగా.. ప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement