Sexual Harrashment: కామ సర్పంచ్, సెక్స్ కోరికలు తీర్చలేదని, ముగ్గురు యువతులపై లైంగిక దాడి, ఒప్పుకోలేదని ఓ యువతి ముక్కును కోసి దారుణం..

బీహార్ లో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ సర్బంచ్ నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి ముక్కును పదునైన ఆయుధంతో కోసేశాడు.

Rape | Representational Image (Photo Credits: Pixabay)

సుపాల్, మార్చి 23: బీహార్ లో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ  సర్బంచ్ నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి ముక్కును పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ గ్రామ సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేదింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, కోపంతో రగిలిపోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి

కాగా, మరోవైపు సర్పంచ్ కూడా పోలీస్ స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌ లో కంప్టైంట్ ఇచ్చాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement