UP Shocker: యూపీలో దారుణం, ఊర్లో గొడవలు పడుతున్నాడని కొడుకును చంపేసిన తండ్రి, శవాన్ని వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టి పరార్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కన్నతండ్రే కుమారుడ్ని దారుణంగా కొట్టి (Man kills 24-year-old son) చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో (dumps body in farm) పూడ్చిపెట్టాడు.
Aligarh, Dec 20: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కన్నతండ్రే కుమారుడ్ని దారుణంగా కొట్టి (Man kills 24-year-old son) చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో (dumps body in farm) పూడ్చిపెట్టాడు. మృతుడ్ని రవి(24)గా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి జయప్రకాశ్ ఈ నేరాన్ని అంగీకరించాడు. రవి వారం రోజులుగా కన్పించకపోవడంతో అతని మామ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
తండ్రి తన కొడుకును ఎందుకు చంపాడో కారణాలను పోలీసులకు తెలిపాడు. తన కుమారుడు తరచూ ఊర్లోవాళ్లతో గొడవపడుతున్నాడని, తనతో పాటు తన తల్లిపై కూడా దాడి చేస్తున్నాడని జయప్రకాశ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాడని, అందుకే ఆగ్రహంతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు.
డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు.. ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!
కుమారుడ్ని హత్య చేసిన అనంతరం జయప్రకాశ్ ఊరి వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు విచారణకు కూడా మొదట సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడే హత్యా నేరాన్ని అంగీకరించాడని వివరించారు.
(The above story first appeared on LatestLY on Dec 20, 2022 12:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

