Andhra Pradesh Shocker: ప్రియుడితో రూంలో శృంగారం, మరో మహిళకు అది ఎలా ఇస్తావంటూ బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు, కోనసీమ జిల్లాలో దారుణ ఘటన
ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని వివాహిత బ్లేడుతో కోసి వేసింది. ఈ ఘటన తాటిపాకలో జరిగింది. మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి (girlfriend cut boyfriend Private Part) చేసినట్లుగా పోలీసులు తెలిపారు
Konaseema, Dec 20: ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని వివాహిత బ్లేడుతో కోసి వేసింది. ఈ ఘటన తాటిపాకలో జరిగింది. మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి (girlfriend cut boyfriend Private Part) చేసినట్లుగా పోలీసులు తెలిపారు. రాజోలు పోలీసుల కథనం ప్రకారం.. రాజోలు మండలం తాటిపాకకు చెందిన వివాహితకు తన బావ అయిన మలికిపురం మండలం గూడపల్లికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు.
డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు.. ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!
ఈ నెల 17వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ లేరంటూ అతడిని ఆమె ఇంటికి పిలిచింది. ఇంట్లో ఉన్న తన కుమారుడిని వివాహిత మరో రూములో పడుకోబెట్టి గడియ పెట్టింది. సన్నిహితంగా ఉన్న సమయంలో అతడికి, ఆ వివాహితకు మధ్య వివాదం తలెత్తింది. మరో మహిళతో చనువుగా (Illegal affair in Konaseema) ఉంటున్నాడంటూ ఆగ్రహించిన ఆమె అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న బ్లేడుతో అతడి మర్మావయవాన్ని కోసేసింది. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతడు బంధువుల సహకారంతో రాజోలు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు.
బాధితుడిని మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేయడంతో అతడు కోలుకుంటున్నాడని బంధువులు తెలిపారు. అతడిపై దాడి చేసిన వివాహితపై రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Dec 20, 2022 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

