Arrested| Representational Image (Photo Credit: ANI)

Bengaluru, Dec 19: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ యువకులు, పురుషులతో పరిచయం పెంచుకుని వారి వాట్సప్‌కి తన నగ్నచిత్రాలను పంపి (Woman Arrested For Sending Nude Pictures ) డబ్బులు వసూలు చేస్తోంది. దీనిపై పొలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ మహిళను నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇది మంచిది కాదని ఆమె భర్త అనేకసార్లు మందలించి గొడవపడినా ఆమె మాత్రం పంథా మార్చుకోకుండా ఈ దందా సాగించడం విశేషం.

దారుణం, కదులుతున్న రైల్లో నుంచి 40 ఏళ్ళ వ్యక్తిని కిందకు తోసేసిన మరో వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి చెందిన బాధితుడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మైసూరు జిల్లాలోని (Mysore district) పిరియా పట్టణ తాలూకాకు చెందిన సవిత అలియాస్‌ మంజులా యాదవ్‌ మైసూరు నగరంలోని విజయనగరలో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. చుట్టుపక్కల దంపతుల వద్దకు వెళ్ళి తాను పేదరాలిని, సాయం చేయాలని వారి నుంచి డబ్బు తీసుకునేది. తరువాత వారితో వరసలు మార్చి మాట్లాడి సంసారంలో గొడవలు పెట్టేది.దీంతో పాటు యువతను, పురుషులను పరిచయం చేసుకుని తరచూ ఫోన్లలో చిట్‌చాట్‌ చేసేది. తన నగ్నచిత్రాలను పంపి (Sending Nude Pictures) బెదిరింపులకు దిగి అందినకాడికి డబ్బులను పిండుకునేది.

కోడి పుంజు కూతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంజనీర్, నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమెలా అవుతుందని ప్రశ్నించిన యజమాని, బెంగుళూరులో వింత ఘటన

ఈ వ్యవహారం తెలిసి సవిత భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఒకసారి చాకుతో పొడిచి దాడి కూడా చేశాడు. అయినప్పటికీ సవిత బుద్ధి మాత్రం మార్చుకోలేదు. చివరకు ఆమె హింసపై పలు ఫిర్యాదులు రావడంతో విజయనగర పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.ఈమె విజయనగరలోని రెండవ స్టేజ్‌లో అభిషేక్‌ రోడ్డులో స్పా పేరుతో వేశ్యావాటికను కూడా నడుపుతోందని పోలీసుల నుంచి సమాచారం.