బెంగుళూరులో కోడిపుంజు కూతతో తన నిద్రకు ఆటంకం కలుగుతోందని ఓ ఐటీ ఇంజినీర్.. పోలీసులను ఆశ్రయించాడు. బెంగళూరులోని జేపీ నగర 8వ ఫేజ్‌లో ఓ అపార్టుమెంటులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడు నగర పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌కు తన ఫిర్యాదును ట్యాగ్ చేశాడు.తమ అపార్టుమెంటు వద్ద స్థలంలో ఒక రైతు కోడిపుంజులు, కోళ్లను పెంచుతున్నాడని, కోడిపుంజులు కూత వేస్తుండటంతో నిద్రాభంగం కలుగుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కోళ్ల పెంపకందారుని ప్రశ్నించారు. నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమా? అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టెక్కీకి, కోళ్ల రైతుకు సర్దిచెప్పి పంపించారు.
Here's Tweet
@BlrCityPolice @DCPSouthBCP @tgpuraps Sir's the roosters ? continue to croon day and night in residential area still, it had stopped for a while but started few weeks ago..pls take action as the resident won't listen to our plea to shift roosters to somewhere else.. https://t.co/6xdSUA42M8
— Nemo (@Nemo_2ETR) December 16, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)