Uttar Pradesh Shocker: అత్యాచారానికి ఒప్పుకోలేదని బాలిక ముక్కు కోసిన కామాంధులు, విషమంగా మైనర్ బాలిక పరిస్థితి, యూపీలోని కాన్పూర్ జిల్లాలో దారుణ ఘటన
లైంగిక దాడిని అడ్డుకున్నందుకు కామాంధులు బాలిక ముక్కు కోసేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం (Uttar Pradesh Shocker) జరిగింది. ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు.
Lucknow, July 1: యూపీలో దారుణం చోటు చేసుకుంది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు కామాంధులు బాలిక ముక్కు కోసేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం (Uttar Pradesh Shocker) జరిగింది. ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు. గురువారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి వారు చొరబడ్డారు. ఆ బాలికను నిర్మూనుష్య ప్రాంతానికి లాక్కెల్లి సామూహిక లైంగిక దాడికి (miscreants for resisting rape) యత్నించారు. అయితే ఆమె ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న కత్తితో ఆమె ముక్కు కోసేసి (Minor girl's nose chopped off ) పారిపోయారు. వీడు తండ్రేనా.. భార్య ప్రియుడితో వెళ్లిందని కూతుళ్లను చంపేసిన కసాయి, మృతదేహాలను ఆటోలో సీటు కింద పెట్టి బాడుగకు తిప్పాడు, కర్ణాటకలో దారుణ ఘటన
కాగా, తీవ్ర రక్తస్రావమైన ఆ బాలికను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో ఆమెను కాన్పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రక్తం బాగా పోవడంతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేయలేదని, నిందితులను అరెస్ట్ చేయలేదని బాలిక తండ్రి ఆరోపించాడు. మొదట ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని అన్నాడు. అయితే నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతుండటంతో కుమార్తె భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.