Teacher Refused to Hoist the Flag: నేను క్రిస్టియన్‌ను జాతీయ జెండా ఎగురవేయను, తమిళనాడులో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వింత వాదన, జీసస్‌కు తప్ప ఇంకెవరికీ నమస్కారం చేయనంటూ పంద్రాగస్టు వేడుకలకు డుమ్మా

ఈ సంఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటు చేసుకుంది. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా ఈ ఏడాది స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి మాత్రం జాతీయ జెండా ఎగురవేసేందుకు నిరాకరించింది. తాను క్రిస్టియన్‌ అని, జాతీయ జెండా ఎగురవేయనని స్పష్టం చేసింది

Chennai, AUG 18:  దేశవ్యాప్తంగా ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence day) ఘనంగా నిర్వహించుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు (Headmistress) మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తాను క్రిస్టియన్‌ (Christian) అని, జాతీయ జెండా ఎగురవేయనని, జెండాకు వందనం కూడా చేయనని తేల్చి చెప్పింది. ఈ సంఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో (Dharmapuri district) చోటు చేసుకుంది. భారత్‌కు స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా ఈ ఏడాది స్వతంత్ర వజ్రోత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి (Tamil Selvi ) మాత్రం జాతీయ జెండా ఎగురవేసేందుకు నిరాకరించింది. తాను క్రిస్టియన్‌ అని, జాతీయ జెండా ఎగురవేయనని స్పష్టం చేసింది. అలాగే జాతీయ జెండాకు వందనం కూడా చేయనని చెప్పింది.

‘మేం దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం, మరెవరికీ కాదు. జెండాను గౌరవిస్తాం కానీ దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం. కాబట్టి, జెండాను ఎగురవేయమని అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలిని కోరాను’ అని తెలిపింది. ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి ఈ ఏడాది రిటైర్‌ కానుంది. దీంతో ఆమెతో జెండా ఎగురవేయించి సత్కరించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.

Bihar Shocker: ప్రేమను అంగీకరించనందుకు నడిరోడ్డుపై తుపాకీతో కాల్పులు, బీహార్‌లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, కూరగాయల వ్యాపారి కూతురిపై కాల్పులు జరిపి పరారైన నిందితుడు, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు,కాల్పుల వీడియో ఇదే! Video| 

అయితే జెండా ఎగురవేయడం నుంచి తప్పించుకునేందుకు తమిళసెల్వి ఆగస్టు15న సిక్‌ లీవ్‌ పెట్టింది. ఆమె గత కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖ ముఖ్య అధికారికి ఆమెపై ఫిర్యాదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement