Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని

కొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.

Pawan Kalyan sworn in as Andhra Pradesh Minister Watch Video

Kondagattu, June 29: కొండగట్టు (Kondagattu) అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతారు. జనసేన అధినేత కొండగట్టుకు వస్తుండటంతో తెలంగాణ జనసేన విభాగం భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం

అప్పటి నుంచి ఇష్టదైవంగా..

ప్రజారాజ్యం పార్టీ తరుఫున 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏపీ ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్‌ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement