Dharmapuri Srinivas (Credits: X)

Hyderabad, June 29: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (Health Issues) బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ బాధాతప్త హృదయంతో ట్వీట్ చేశారు. డీఎస్ మృతిపై ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్‌ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు

కాంగ్రెస్ తో సుదీర్ఘ ప్రయాణం

డీఎస్ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌ లో కొనసాగారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.1989, 99, 2004లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలం పాటు పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్‌ లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా సైతం కొనసాగారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.

రైతుల‌కు రుణ‌మాఫీకి రేష‌న్ కార్డుతో సంబంధం లేదు! కీల‌కవ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి