Hyderabad, June 29: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ (Telangana DSC 2024 Exam Schedule Out) ఎట్టకేలకు విడుదలైంది. జులై 18 నుంచి అగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్ లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు సబ్జెక్టులు, పోస్టులవారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తిస్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. తెలంగాణలో (Telangana) 11,062 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రైతులకు రుణమాఫీకి రేషన్ కార్డుతో సంబంధం లేదు! కీలకవ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదిగో..
- జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష
- జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
- జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
- జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
- జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష
- జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
- జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
- జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
మేడిగడ్డ రిపేర్ పనులకు బ్రేక్, ఇప్పట్లో పనులు చేపట్టే పరిస్థితి లేదంటున్న అధికారులు