#IndiaSupportsCAA: ముల్లును ముల్లుతోనే! పౌరసత్వ సవరణ చట్టంపై సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ, దేశ పౌరులు #IndiaSupportsCAA హాష్‌టాగ్‌ వాడుతూ సిఎఎకు సోషల్ మీడియాలో మద్ధతు తెలపాలని కోరిన ప్రధాని నరేంద్ర మోదీ

CAAకు వ్యతిరేకంగా వ్యాప్తి చెందుతున్న పుకార్లను నియంత్రించడానికి బీజేపీ 'జాన్ జాగ్రాన్ అభియాన్' కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సహాయంతో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోదీ సర్కార్ దేశంలో సిఎఎ ప్రవేశపెట్టిందనే సందేశాన్ని వ్యాప్తి చేయనుంది. సిఎఎ భారత్ లాంటి దేశానికి ఎంత ముఖ్యమైన చట్టమో చెబుతూ....

File image of PM Narendra Modi (Photo Credits: IANS)

New Delhi, December 30: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హైఓల్టేజ్ నిరసనలు, సోషల్ మీడియాలో #IndiaAgainstCAA పేరిట వ్యతిరేక ప్రచారం జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ (BJP) ఇక దానిపై అదే రీతిలో ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో పౌరసత్వ చట్టంపై అవగాహనా ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. దేశ పౌరులు సోషల్ మీడియాలో #IndiaSupportsCAA హాష్‌టాగ్ (Hashtag)ఉపయోగిస్తూ సిఎఎకు తమ మద్ధతు తెలియజేయాలని ప్రధాని మోదీ (PM Narendra Modi)  కోరారు. అంతేకాకుండా ఆ హాష్‌టాగ్‌ను క్లిక్ చేసి సిఎఎకి సంబంధించి వాస్తవాలను తెలియపరిచే సమాచార చిత్రాలు, వీడియోలు, గ్రాఫిక్ చిత్రాలు చూసి వాస్తవాలను గ్రహించాలి, మరింత సమాచారం కోసం 'నమో యాప్' లో శోధించమని ప్రధాని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో కొత్త తరహా నిరసన, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు

"భారతదేశం CAA కి మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఈ చట్టం హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించబడిందే కానీ, ఎవరి పౌరసత్వాన్ని తొలగించేది కాదు" అని మోదీ ట్వీట్ చేశారు.

Check PM Narendra Modi Tweet:

 

CAAపై నెలకొన్న అపోహలను తొలగించటానికి బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే ఆ హాష్ టాగ్ ను ఉపయోగించి 'Myth Buster' (మిధ్యా మదనం) పేరుతో అనేక పోస్టులను చేస్తుంది. తద్వారా CAAపై జరుగుతున్న దుష్ప్రచారం ఏమిటి?, వాస్తవం ఏమిటి అని వివరిస్తూ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ఒకటి అస్సాంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి కౌంటర్ ఇస్తూ

" అక్రమ వలసదారుల కట్-ఆఫ్ తేదీని గుర్తించడం / బహిష్కరించడం వంటి అంశానికి సంబంధించి 'అస్సాం ఒప్పందం' యొక్క పవిత్రతను తగ్గించడం గానీ, ఉల్లంఘనలకు పాల్పడటం గానీ CAA ద్వారా జరగదు" అని తెలియపరిచేలా ఈ రకంగా ఒక పోస్ట్ చేసింది.

Here's the tweet:

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా  'భారత్ CAAకు వ్యతిరేకం' పేరుతో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న దాడికి ప్రతిగా  'భారత్ CAAకు అనుకూలం' పేరుతో బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది.

సోషల్ మీడియా ద్వారా ప్రచారమే కాకుండా, CAAకు వ్యతిరేకంగా వ్యాప్తి చెందుతున్న పుకార్లను నియంత్రించడానికి బీజేపీ 'జాన్ జాగ్రాన్ అభియాన్' కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సహాయంతో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మోదీ సర్కార్ దేశంలో సిఎఎ ప్రవేశపెట్టిందనే సందేశాన్ని వ్యాప్తి చేయనుంది. సిఎఎ భారత్ లాంటి దేశానికి ఎంత ముఖ్యమైన చట్టమో చెబుతూ, దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రజలు ఈ చట్టం పట్ల సానుకూలత వ్యక్తం చేసేలా దేశవ్యాప్తంగా 250 ప్రెస్ కాన్ఫరెన్సులు, ర్యాలీలు మరియు సంపార్క్ అభియాన్లను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now