New Delhi, December 30: సీఏఏ, (CAA)ఎన్ఆర్‌సీలకు(NRC) వ్యతిరేకంగా (Tamil Nadu) తమిళనాడులో కొత్త తరహా నిరసనలు ఊపందుకున్నాయి. మొన్నమహిళలు సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు (Rangoli) వేసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎంపీ కనిమెళి(DMK MP Kanimozhi) ఇంటి బయట ఈ ముగ్గులు దర్శనమిస్తున్నాయి.
ఈ ముగ్గుల్లో నో సీఏఏ, నో ఎన్నార్సీతో(No to CAA, No to NRC) కూడిన అక్షరాలను రాసారు. ఈ వివాదం మీద ఇప్పటికే ఏడు మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని తర్వాత విడిచిపెట్టారు. కాగా తమిళనాడులో నిరసనలు కొంచెం తగ్గు ముఖం పట్టాయి.
గత వారం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) (Citizenship Amendment Act (CAA))నిరసిస్తూ చెన్నైలోని కొందరు ఆందోళనకారులు రోడ్లపైనా, కొందరి ఇంటి ముందు ముగ్గులు వేశారు. సీఏఏకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
ANI Tweet:
Chennai: 'Rangoli' against #CitizenshipAmendmentAct and #NationalRegisterofCitizens seen outside homes of late M Karunanidhi, DMK Chief MK Stalin and DMK MP Kanimozhi pic.twitter.com/5yZN0acBVZ
— ANI (@ANI) December 30, 2019
దీంతో పోలీసులు నలుగురు మహిళలను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు. బీసెంట్ నగర్‌లోని ఎలిటోస్ బీచ్ ప్రాంతంలో ఆ మహిళలు ఈ ముగ్గులు వేశారు. 'సీఏఏ వద్దు, ఎన్ఆర్‌సీ వద్దు' అంటూ ఆ ముగ్గుల్లో నినాదాలు రాశారు.
ANI Tweet:
Check out the men of Tamil Nadu breaking gender stereotypes to protect our culture and the constitution through #KolamAgainstCAA #KolamProtest pic.twitter.com/yqdqJ5n63G
— Gayatri Khandhadai (@gayatrikl) December 29, 2019
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ అసిస్టెంట్ కమిషనర్ సహా పోలీసు సిబ్బంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. వారు నిరసన తెలిపేందుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. అయితే, నిరసన తెలిపేందుకు చెన్నై పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని, అందుకే ఈ వినూత్న పంథాను ఎన్నుకున్నామని నిరసనకారుల్లో ఒకరు తెలిపారు.
ANI Tweet:
@NaamTamilarOrg @SeemanOfficial@thirumaofficial @VelmuruganTVK Let's Trend this #KolamProtest #KolamAgainstCAA and tomorrow let's post all #Kolam photos with these tags to give back for the arrest act against our mothers and sisters! pic.twitter.com/dauPJZtU70
— Feel Good Stories (@StoriesFeel) December 29, 2019
నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని డీఎంకే నాయకుడు ఎమ్‌కే స్టాలిన్(DMK Chief MK Stalin) ఖండించారు. ''ఏడీఎంకే ప్రభుత్వ అకృత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన తెలిపినందుకు వారిని అరెస్టు చేశారు. నిరసన తెలిపే హక్కును కూడా వారికి ఇవ్వడం లేదు'' అంటూ ట్వీట్ చేశారు.
సీఏఏ వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిని నియంత్రించేందుకు తమకు అధికారాలున్నాయని.. చిన్న, చిన్న జన సమూహాలు పెద్ద గుంపులుగా పెరిగి శాంతి భద్రతల సమస్యకు దారితీయొచ్చని ఓ పోలీసు అధికారి అన్నారు. నిరసనలు అదుపు తప్పకముందే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ANI Tweet:
Told my mom to do that same tomo.. She said i will tell my neighbors !!! My street will be #KolamProtest pic.twitter.com/jKXmW6aBv0
— 𑀢𑀺𑀷𑁂𑀘𑀼 𑀓𑀼𑀫𑀸𑀭 (@ddkrey619) December 29, 2019
ఇదిలా ఉంటే గత వారం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్‌సీలకు(National Register of Citizens (NRC)) వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగా చెన్నైలో చాలా మంది సామాజిక కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, రాజకీయ నాయకులు కలిసి ఓ సంగీత కార్యక్రమం కూడా నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మధ్యే ఈ కార్యక్రమం జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా చెన్నైలో పెద్ద ర్యాలీ కూడా జరిగింది. 650 అడుగుల పొడవైన జెండాను ఈ ర్యాలీలో ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ఆందోళనలను అణచివేయాలని కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసేలా కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఆదాయానికి నష్టం వస్తుందని తెలిసినా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.