PM Narendra Modi Rally: నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి, ఢిల్లీ పార్టీలేవి మోడీని అడ్డుకోలేవు, సీఏఏపై ప్రజల తీర్పును గౌరవించండి, ప్రతిపక్షాలకు కనీసం చట్టాలు కూడా తెలియదు, రామ్ లీలా మైదానంలో గర్జించిన ప్రధాని మోడీ
PM Narendra Modi at Ramlila Maidan (Photo Credits: Twitter)

New Delhi, December 22: రామ్ లీలా మైదాన్ (Ramlila Maidan) అనేక వేదికలకు సాక్షిగా నిలిచిందని ప్రధాని మోడీ (PM Narendra Modi) అన్నారు. ఢిల్లీలోని (Delhi) రామ్ లీలా మైదానంలో ఈ రోజు నిర్వహించిన ర్యాలీ సభలో ఆయన మాట్లాడుతూ... 'సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ (BJP) శ్రేణులకు ధన్యావాదాలు. మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది.

ఢిల్లీలోని చాలా మంది ఇప్పటికి భయం, అనిశ్చితి, మోసం, ఎన్నికల్లో ఇచ్చే అసత్య హామీలపై అసంతృప్తితో ఉన్నారు' అని వ్యాఖ్యానించారు. 'ఇక్కడి మెట్రో నాలుగో దశ ప్రాజెక్టును ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం రాజకీయం చేసింది. ఈ ప్రాజెక్టు ఏనాడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చాలా ఆలస్యమైంది. ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని వ్యాఖ్యానించారు.

Here's Video

పౌరసత్వ సవరణ చట్టంపై (Citizenship Amendment Act)విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మండిపడ్డారు. కనీసం చట్టాలు కూడా తెలియకుండా ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంటులో ఇటీవల సీఏఏ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ప్రజల తీర్పుని గౌరవించాలి' అని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌కు గౌరవం ఇచ్చే విధంగా అందరు లేచి నిలబడాలాని ప్రజలకు కోరారు. మరోవైపు కులాలు మతాలు చూడకుండా అభిృవృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని మోడీ చెప్పారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని 40 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశామని అన్నారు.

PM Modi At Ramlila Maidan

ఢిల్లీ పరిస్థితులు, బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రధాని ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రజలకు పట్టాలు ఇవ్వడం తోపాటు మౌలిక వసతులపై ఆయన ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి ఎన్నికైన మొత్తం పార్లమెంట్ సభ్యులు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు పలికారని ,వారి నిర్ణయాన్ని గౌరవించడం ప్రజల బాధ్యత అని పేర్కొన్నారు. అయితే కొద్ది మంది పౌరసత్వ చట్టంపై రూమర్స్ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

మోడిపై కోపం ఉంటే తీర్చుకొండి..కాని బడుగు బలహీన వర్గాలు, రోజువారి కూలి చేసుకునే ప్రజలపై దాడులు చేయవద్దని చెప్పారు. మోడీ దిష్టిబొమ్మలు కాల్చండి కాని.. ప్రజల ఆస్తులను తగులబెట్టవద్దు ప్రధాని కోరారు.. ఇక ఆందోళనల్లో భాగంగా పోలీసులపై దాడులు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల రక్షణకు అహర్నిషలు కృషి చేసే పోలీసులపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలోని లక్షల మంది పోలీసులు కులమతాలు చూసుకోకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని అయితే వారిపై కూడ దాడులు చేయడం చాల దురదృష్టకరమని చెప్పారు.

కాగా వచ్చే ఏడాది ఢిల్లీ ఎన్నికల నేపథ్యంనే (Delhi Assembly Elections 2020) మోడీ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌పై (Aravind kejriwal GOVT) విమర్శలు గుప్పించారు. ఆప్ (AAP)ప్రభుత్వానికి దూరదృష్టి లేదని దుయ్యబట్టారు.సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం అనేక అబద్దాల హామీలు ఇచ్చిందని మోడీ విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బే ఎళ్లు గడుస్తున్నా... ఢిల్లీ ప్రజలు భయం ,తప్పుడు హమీల మధ్య జీవిస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కాలనీ ప్రజలు అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. అందుకే మొత్తం 1700 కాలనీల్లో ఉన్న సుమారు 40 మంది లబ్దిదారుకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో ఎలాంటీ కులమతాలు చూడలేదని అన్నారు. మోడీని ఢిల్లీలోని పార్టీలేవీ అడ్డుకోలేవని, 1,700 కాలనీలకు హద్దులు నిర్ణయించామని, 40 లక్షల మంది ప్రజలు ఇప్పుడు సొంత భూములు కలిగి ఉన్నారని అన్నారు.

తప్పుడు వీడియోలు తెచ్చిన పాపానికి ఆప్‌ను ప్రజలే శిక్షించాలని, తప్పుడు ప్రచారాలు సాగిస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు. బీజేపీ అగ్రనేతలు విజయ్ గోయెల్, మనోజ్ తివారీ, ప్రకాష్ జవదేకర్, గౌతమ్ గంభీర్‌తో పాటు అశేష జనవాహిని ఈ ర్యాలీలో పాల్గొన్నారు.