kamal haasan to be nominated for rajya-sabha!(X)

Delhi, Feb 13:  మక్కల్ నీది మయ్యమ్(Makkal Needhi Maiam) అధినేత, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Hassan) త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారా.?, గతంలో ఇండియా కూటమికి మద్దతిచ్చిన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా?, అందుకు మంత్రి పీకే శేఖర్ బాబు...కమల్‌ని కలిశారా అంటే తమిళ రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.

తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ హాసన్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం స్టాలిన్(CM Stalin) గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు(Rajya Sabha elections) కన్ఫార్మ్ చేశారని వెల్లడించినట్లు సమాచారం. జూన్‌లో తమిళనాడులో పలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈసారి కమల్‌కు ఛాన్స్ ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయం తీసుకోగా ఇదే విషయాన్ని కమల్‌కు వెళ్లడించారు మంత్రి శేఖర్.

త్వరలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాదయాత్ర.. ఎమ్మెల్సీ కవిత మహిళా శంఖారావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట, వివరాలివే

వాస్తవానికి గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కమల్(Kamal) పార్టీ పోటీ చేయలేదు. ఇండియా కూటమికి మద్దతుగా ఓట్లు చీలకుండా పోటీకి దూరంగా ఉన్నారు కమల్. అంతేగాదు ఇండియా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌కు రాజ్యసభ ఆఫర్ చేయగా ఇప్పుడు అవకాశం రావడంతో ఇచ్చిన మాట ప్రకారం స్టాలిన్ ... కమల్‌ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికి కమల్ పార్టీ స్థాపించిన తర్వాత పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కమల్ కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కమల్. ఇక ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు.