BRS Leader, Siddipet MLA Harish Rao Padayatra soon(X)

Hyd, Feb 12:  తెలంగాణ ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచింది బీఆర్ఎస్(BRS Party). ఇప్పటికే సందర్భాన్ని బట్టి ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ను ముప్పు తిప్పలు పెడుతోంది బీఆర్ఎస్. తాజాగా రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్ర(Harish Rao Padayatra)కు సిద్ధమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు హరీశ్‌ రావు. ఈ మేరకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్(KCR) నుండి అనుమతి లభించింది.

ఈ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు పాటు 130 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు హరీశ్‌ రావు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు భారీ బహిరంగ సభను నిర్వహించనుండగా ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు.

మినీ మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జాతర, 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

ఇక మరోవైపు మార్చి 8న మహిళా శంఖారావం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). మీడియాతో మాట్లాడిన ఆమె.. మానవత్వం లేకుండా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారు అన్నారు. ఢీల్లి నుండి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ వచ్చి ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పారు.. రేవంత్ రెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అన్నారు.

బీడీ కార్మికులకు కేసీఆర్ పింఛన్ ఇచ్చారు.. రేవంత్ రెడ్డి సీఎం(CM Revanth Reddy) అయ్యాక క్రైమ్ రేట్ 20 శాతం పెరిగిందన్నారు. ఆడబిడ్డలు అభద్రతా భావంలో ఉన్నారు.. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు అన్నారు.ఓల్డ్ సీటీలో శివాలయంలో మాంసం వేశారు అంట.. కేసీఆర్ హయాంలో పెట్టిన సీసీ కెమెరాల్లో 70 శాతం పని చేయడం లేదు అన్నారు. మహిళలు భద్రత కోరుకుంటారు.. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు.. ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ ఇచ్చారు,గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కేసీఆర్ వెయ్యి రూపాయలు ఇచ్చారు అన్నారు.

తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి 35,000 బాకీ పడ్డారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. సోనియాగాంధీ మొహం చూసి ప్రజలు ఓట్లు వేశారు..రాహుల్ గాంధీ వరంగల్ రాకుండా పారిపోయారు అన్నారు. ఇచ్చిన మాట నిలుపుకొకపోతే తెలంగాణలో ఎక్కడా రాహుల్ గాంధీ తిరగలేని పరిస్థితి వస్తుంది.. మార్చి 8వ తేదీన మహిళా శంఖారావం ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్నాం అన్నారు. మార్చి 8వ తేదీన అసలు సినిమా చూపెడతాము.. ఫ్రీబస్సులో మహిళలకు గౌరవం లేదు అన్నారు.