Mangaluru, December 20: ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సికి (NRC) ఇటీవల ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా దేశంలోని అనేక చోట్ల పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వస్తున్నారు. భద్రతా బలగాల నిషేధాజ్ఞలను సైతం ధిక్కరిస్తూ ఉద్యమిస్తుండటం (Anti CAA Protests) తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్నిచోట్ల నిరసనకారుల మధ్యలో అల్లరిమూకలు కూడా చొరబడి పోలీసులపై దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తుండంతో పరిస్థితులు అదుపుతప్పి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న గురువారం చోటుచేసుకున్న కాల్పుల్లో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
పౌరసత్వం సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా డిసెంబర్ 19న వివిధ సంస్థలు దేశవ్యాప్తంగా అనేక నగరాలలో ప్రణాళికాబద్ధమైన నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వివిధ రాష్ట్రాలలో నిషేధాజ్ఞలు, 144 సెక్షన్లు విధించారు. అయినప్పటికీ వాటినేవి లెక్కచేయకుండా నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒక్కోచోట వందల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరిత్రకారుడు రామ్‌చంద్ర గుహ, కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, హర్ష్ మాండర్, గురువారం అదుపులోకి తీసుకున్న అనేక మందిలో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిని అక్కడే కాల్చేయండి - మంత్రి ఆదేశాలు
కర్ణాటకలో..
ఈ క్రమంలో కర్ణాటక లోని మంగళూరులో నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పరిస్థితులు అదుపుతప్పటంతో పోలీసులు 'ఫైరింగ్' జరిపారు. ఈ కాల్పుల్లో కనీసం ఇద్దరు నిరసనకారులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. పోలీసులు పలుచోట్ల కర్ఫ్యూ విధించారు. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ ను తగలబెట్టే ప్రయత్నం చేయడంతోనే ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని మంగళూరు నగర సీపీ పీఎస్ హర్ష (Dr P S Harsha) పేర్కొన్నారు.
Curfew Till December 22
Mangaluru City Police Commissioner, PS Harsha: Curfew being extended to entire Mangaluru city commissionerate, till 22nd December midnight.
— ANI (@ANI) December 19, 2019
ఉత్తరప్రదేశ్‌లో..
ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా నిరసనలతో అట్టుడికింది. రాష్ట్రమంతటా కూడా సెక్షన్ 144 విధించారు, చాలా చోట్ల మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Scene in UP:
Uttar Pradesh Road Transport Corporation bus set on fire in Sambhal. Police vehicles targeted. In Lucknow Police post set on fire, several motorcycles torched in `peaceful' protests. #CitizenshipAmmendmentAct protests in Delhi, Mumbai, Bengaluru. In Delhi 19 metro stations shut. pic.twitter.com/0RZTW55sdl
— GAURAV C SAWANT (@gauravcsawant) December 19, 2019
గుజరాత్‌లో..
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. గుంపులుగుంపులుగా రోడ్లపైకి వచ్చి పలు పోలీసు మరియు మీడియా వాహనాలను ధ్వసం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసరడమేకాకుండా, ఒంటరిగా దొరికిన పోలీసులను దారుణంగా కొట్టారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
A cop was thrashed by a mob:
A clip shows how a cop was thrashed by a mob protesting Citizenship Amendment Act without permission in Shah Alam area of Ahmedabad earlier today: city police officials have made it clear that cases will be registered and those involved in attacks will be identified and arrested pic.twitter.com/pQGvDoIOkr
— DeshGujarat (@DeshGujarat) December 19, 2019
దిల్లీలో..
దేశరాజధాని దిల్లీ సిఎఎ నిరసనలతో అట్టుడికింది. దిల్లీ నుంచే కాకుండా సమీపంలోని పొరుగు రాష్ట్రాల నిరసనకారులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దిల్లీలో పలుచోట్ల మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతో పోలీసులు దాదాపు 1200 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Peaceful Protest:
Glimpse amidst protest.
Rose Down the Barrel.#Section144 #IndiaAgainstCAA #internetshutdown @LaxmanYadav88 @nsaibalaji @kavita_krishnan @ADH05748232 pic.twitter.com/5IXeVhFbQ3
— AISA - Delhi University (@aisa_du) December 19, 2019
ఇతర ప్రదేశాలలో..
ఇక ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై భోపాల్, గువహటి, కోల్ కతా, కోజికోడ్ తదితర నగరాలలో పౌరసత్వ నిరసనలు జరిగినప్పటికీ చెదురుమదురు సంఘటనలు మినహా నిరసన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి.
ఇదిలా ఉండగా ఈ నిరసనలకు వ్యతిరేకంగా, మరికొన్ని వర్గాల ప్రజలు, సంఘాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని మరియు ఎన్‌ఆర్‌సిని సమర్థిస్తూ వివిధ రకాల ప్రదర్శనలు చేస్తున్నారు.