Lucknow, December 26: పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (CAA) పై నిరసనలు చేపడుతున్న సమయంలో ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు (Uttar Pradesh Police) ప్రత్యేక దృష్టిపెట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 'హింసాత్మక నిరసన కారుల' (Violent Protesters) చిత్రాలతో పోస్టర్లను విడుదల చేయాలని నిర్ణయించారు. యూపీ పోలీసులు ఇప్పటికే దీనిపై రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టారు. నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించే వారి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి నగదు రివార్డులు (Cash Rewards) కూడా ప్రకటిస్తున్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెపుతున్నారు.
ఇప్పటికే హింసాకాండకు పాల్పడిన 110 నిందితుల ఫోటోలను మౌలోని జిల్లా పోలీసులు విడుదల చేశారు. జిల్లాలో హింసకు సంబంధించి మొత్తం 21 మందిని అరెస్టు చేశారు. వారణాసిలో 73 మంది మరియు కాన్పూర్‌లో 48 మంది నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఫిరోజాబాద్‌లో మొత్తం 80 మంది నిందితుల ఫోటోలను యూపి పోలీసులు విడుదల చేశారు. వీరంతా గత శుక్రవారం నల్‌బంద్ ప్రాంతంలో జరిగిన హింసాకాండకు కారణమని పోలీసులు తెలిపారు. నిరసనకారుల మధ్య అల్లరిమూకలు, తీవ్ర హింసాత్మకమవుతున 'పౌరసత్వ' ఆందోళనలు
ఇక బిజ్నోర్ పట్టణంలో ఆస్తుల విధ్వంసానికి పాల్పడి పలు వాహనాలకు నిప్పుపెట్టిన అల్లరి మూకలను పోలీసులు గుర్తించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటికే 146 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, అల్లర్లకు పాల్పడిన వారి సమాచారం అందించే వారికి రూ. 25,000 నగదు రివార్డును పోలీసులు ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్ అంతటా హింసాకాండకు పాల్పడిన అనుమానితుల పోస్టర్లను పోలీసులు రిలీజ్ చేస్తున్నారు. వారి అచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా, నగదు బహుమతి అందిస్తామని ప్రచారం నిర్వహిస్తున్నారు.
గోరఖ్‌పూర్‌లో, హింసాకాండకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 మంది అనుమానితులకు సంబంధించిన పోస్టర్లను ధ్వంసం అయిన ఇళ్ల బయట పోలీసు శాఖ అతికించింది. మరో 69 మంది నిందితుల ప్రత్యేక జాబితాను, వారి ఫోటోలతో సహా పోలీసు శాఖ విడుదల చేసింది. ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సిఎఎ (Citizenship Amendment Act) కు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు - వారంతా పోలీసులు జరిపిన కాల్పులతోనే చనిపోయారనేది ఒక ఆరోపణ. అయితే, కాన్పూర్ మరియు బిజ్నోర్లలో రెండు సందర్భాలలో మాత్రమే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.