PM Modi’s Special Tweet on Women’s Day(X)

Delhi, March 8:  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi On Womens Day). నారీ శక్తికి వందనం అంటూ ఓ ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీ శక్తికి నమస్సులు! మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది. మా పథకాలు, కార్యక్రమాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నేడు, నా సోషల్ మీడియా ఖాతాలను వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతున్న మహిళలు నిర్వహించనున్నారు అని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సత్తా చాటిన మహిళలు తమ అనుభవాలను వివరించారు. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి, శాస్త్రవేత్తలు ఎలినా మిశ్రా , శిల్పి సోనీ సహా అనేక మంది మహిళా ప్రముఖులు ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు(Womens Day).

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...

స్పూర్తినిచ్చే సందేశాలు ఇచ్చారు. వనక్కం! నేను వైశాలి(Nari Shakti). అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రధాని తిరు నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. నేను చదరంగం ఆడుతాను, నా ప్రియమైన దేశాన్ని అనేక టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను అని 23 ఏళ్ల వైశాలి పేర్కొన్నారు. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించండి అని తెలిపారు.

అలానే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. బాలికలను ప్రోత్సహించండి. వారి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచండి, వారు అద్భుతాలు చేస్తారు. నా జీవితంలో, నా తల్లిదండ్రులు తిరు రమేశ్‌బాబు మరియు తిరుమతి నాగలక్ష్మి నాకు గొప్ప మద్దతునిచ్చారు అని తెలిపారు.

PM Modi’s Special Tweet on Women’s Day

ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు ఎలినా మిశ్రా మరియు శిల్పి సోనీ కూడా తమ సందేశాలను పంచుకున్నారు. భారతదేశం ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రానికి అత్యుత్తమ వేదిక... మన దేశంలో మహిళలకు విస్తృతమైన అవకాశాలు లభిస్తున్నాయి అన్నారు. న్యూక్లియర్ టెక్నాలజీ వంటి రంగాల్లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంతరిక్ష రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండటంతో, భారత్ కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని.. భారత మహిళలు అసాధారణమైన ప్రతిభ కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు.