Maharashtra Govt Formation: ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రే, 'మహా వికాస్ అఘాడి' గా ఏర్పాటైనా శివసేన- ఎన్‌సిపి - కాంగ్రెస్ పార్టీలు, నవంబర్ 28న ప్రమాణ స్వీకారోత్సవం

బుధవారమే విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక విశ్వాస పరీక్షలో ఈ కూటమి గెలుపు లాంఛనంగా కనిపిస్తుంది....

Uddhav Thackeray with Sharad Pawar | (Photo Credits: IANS)

Mumbai, November 26: మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో మరోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగుపడింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), కాంగ్రెస్ పార్టీలు కలిసి 'మహా వికాస్ అఘాడి' (Maha Vikas Aghadi)అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడి, తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడి నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రేకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

ముంబైలోని ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హోటెల్ లో ఈరోజు మహా వికాస్ కూటమి ఎమ్మెల్యేలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్దవ్ ఠాక్రేను తమ కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎన్సీపీ శాసనసభాపక్ష నేత జయంత్ పాటిల్, ఉద్దవ్ పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరత్ ఆ ప్రతిపాదనను బలపరిచారు. ఈ తీర్మానానికి మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరూ తమ మద్ధతు తెలిపారు.  ఈ 'మహా' రాజకీయాలు భరించలేను మహాప్రభో, కాస్త సెలవిప్పించండి

ఇక భేటీ ముగియగానే మహా వికాస్ అఘాడి లోంచి మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీని కలవడానికి బయలుదేరారు.

మూడు రోజుల ముచ్చటైన సీఎం పదవి, దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా

బుధవారమే విశ్వాస పరీక్ష ఉన్న నేపథ్యంలో ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక విశ్వాస పరీక్షలో ఈ కూటమి గెలుపు లాంఛనంగా కనిపిస్తుంది.  నవంబర్ 28న  సాయంత్రం 6:40 గంటలకు  ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్కులో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు ప్రకటించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement