Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరత్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రాజీనామా, 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన తీరత్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ ముఖ‍్యమంత్రి పీఠాన్ని ​ఎవరు అధిరోహించనున్నారనే అనేక అంచనాల మధ్య ఈ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం రాజీనామా చేయడంతో బుధవారం నాటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tirath Singh Rawat (Photo Credits: Facebook)

Dehradun, March 10: ఉత్తరాఖండ్ ముఖ‍్యమంత్రి పీఠాన్ని ​ఎవరు అధిరోహించనున్నారనే అనేక అంచనాల మధ్య ఈ ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం రాజీనామా చేయడంతో బుధవారం నాటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయంత్రం తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా తీరత్ సింగ్ రావత్ మాట్లాడుతూ తాను చిన్న గ్రామం నుండి వచ్చిన పార్టీ కార్యకర్తగా తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదంటూ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకాన్ని ఉంచిన ప్రధాని, హోం మంత్రి పార్టీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామనీ, గత నాలుగేళ్లుగా చేపట్టిన కృషిని ముందుకు తీసుకెళతామంటూ హామీ ఇచ్చారు. అయితే సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యే ధ‌న్ సింగ్ రావ‌త్, బీజేపీ సీనియర్‌ నేత ఎంపీ అజయ్‌భట్‌, అనిల్‌ బలూని పేర్లు కూడా బాగా వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కుమాన్‌ ప్రాంతం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సీఎం రావత్ రాజీనామాతో చిక్కుల్లో బీజేపీ, హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆందోళనతో బీజేపీ వర్గాల్లో గుబులు

56 ఏళ్ల తీరత్ సింగ్ రావత్.. 2013-15 మధ్య ఉత్తరాఖండ్‌లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రాష్ట్ర ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ నిషాంక్, ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్‌ తదితరుల పేర్లను పరిశీలించిన అనంతరం సీఎం పదవిని తీరత్ కు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మంగళవారం డెహ్రాడూన్‌లో పార్టీ లెజిస్లేచర్ మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పనితీరు సరిగా లేని కారణంగా రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్లు రావడంతో మాజీ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Advertisement
Advertisement
Share Now
Advertisement