Astrology: సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకండి. దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది..
ఇలా మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.
సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేసినట్లయితే మీ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయని గ్రంథాలలో ఉంది రాత్రిపూట కొన్ని పనులు చేయడం మంచిది కాదు. ఇలా మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. దీని కారణంగా మీ ఇంట్లో ఆర్థిక నష్టం డబ్బు ఖర్చు అవ్వడం ఆరోగ్య సమస్యలు వస్తాయి. సూర్యాస్తమయం సమయం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వస్తువులు దానం చేయొద్దు- సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు, ఉప్పు, డబ్బు, పెరుగు వంటి వాటిని దానం చేయకూడదు. అటువంటివి దానం చేయడం ద్వారా మీ ఇంట్లో అశుభంగా ఉంటుంది. సాయంత్రం పూట ఎవరికన్నా ఇవి దానం చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యాస్తమయం సమయం తర్వాత ఈ పనులు చేయవద్దు.
సాయంత్రం నిద్రపోవడం మంచిది కాదు- సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దరిద్ర లక్ష్మి ఆవహిస్తుంది. సాయంత్రం పూట నిద్రపోవడం వల్ల ఇంట్లో అనేక రకాల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది.
ఇల్లు ఊడవద్దు- కొన్ని శాస్త్రాల ప్రకారం చీపురుని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి సాయంత్రం పూట ఇంటిని ఉడవడం మంచిది కాదు. సూర్యస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం లేదా కడగడం అశుభం దీనివల్ల మీ ఆరోగ్యము డబ్బు రెండు కూడా ఇబ్బంది గురవుతాయి.
తులసి ఆకులను తెంపవద్దు- సాయంత్రం సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి ఆకులను తెంపవద్దు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. సాయంత్రం పూట తులసకులను తెంపడం వల్ల అది వాస్తు దోషాలను ఇస్తుంది. అంతేకాకుండా మీకు అనేక రకాల అనర్ధాలను తీసుకొస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.