Astrology: ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో పచ్చ రత్నాన్ని ధరించకూడదు..

అయితే తప్పుడు రత్నాలు ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గందరగోళం ఏర్పడుతుంది. జీవితంలో సంతోషం కరువవుతుంది ఆర్థిక నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.

astrology

రత్నశాస్త్రం 9 రత్నాల మంచి చెడులను చూపిస్తుంది. అయితే తప్పుడు రత్నాలు ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గందరగోళం ఏర్పడుతుంది. జీవితంలో సంతోషం కరువవుతుంది ఆర్థిక నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ధనవంతులు పేదవారుగా మారతారు. దరిద్రం పెరుగుతుంది. అందువల్ల ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు ఏ రత్నాలను కూడా ఫ్యాషన్ గా ఎవరి సలహా మేరకు కూడా ధరించకూడదు. జ్యోతిష్యుని సంప్రదించి మీ జాతకాన్ని చూపించి మీకు సరైనటువంటి రక్తాన్ని మాత్రమే ధరించడం ఉత్తమం. అయితే రత్నాల శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రత్నము ఒక వ్యక్తిని సంపన్నుడ్ని చేస్తాయి. అయితే దాని ధరించడం ద్వారా మీకు ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. ఉన్నత స్థానాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎవరు ఈ పచ్చ రత్నాన్ని ధరించాలో జ్యోతిషంలో చెప్పబడింది. ఎవరికి లాభదాయమో ఎవరికి మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ రాశుల వారు ఆకుపచ్చని రత్నాన్ని ధరించడం శుభప్రదం.

వృషభ రాశి వారు ,కన్యా రాశి వారు, తులా రాశి వారు, మకర రాశి వారు, కుంభ రాశి వారు ఈ రాశుల వారు కి ఆకు పచ్చని రత్నం కలిసి వస్తుంది. మీరు ఆకుపచ్చ రత్నాన్ని ధరించవచ్చు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

ఎవరు ధరించకూడదు- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం ,కర్కాటకం వృశ్చిక రాశి వారికి ఆకుపచ్చ రత్నము అంత మంచిది కాదు. ఆకుపచ్చదాన ధరించడం వల్ల వీరికి కొన్ని అశుభ ఫలితాలు ఏర్పడతాయి.

సరైన రత్నాలను ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్యులను సంప్రదించాలి. వారి నుండి సరైన సమాచారంతో మాత్రమే మీరు రత్నాలను ధరించాలి. లేకపోతే అనేక నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. దురదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయి. జీవితం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఎటువంటి సలహా లేకుండా సొంత నిర్ణయాలతో ఏ రత్నాన్ని పడితే ఆ రత్నాన్ని దారించకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు