Astrology: జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మానివేస్తే మంచిది..

అదృష్టం అనేది వారి జీవితంలో అంతగా ఉండదు. అయితే మనం చేసే కొన్ని అలవాట్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.

laxmi devi

చాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. అదృష్టం అనేది వారి జీవితంలో అంతగా ఉండదు. అయితే మనం చేసే కొన్ని అలవాట్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు పేదరికాన్ని అనుభవిస్తుంది. అటువంటి అప్పుడు మనము త్వరగా ఈ అలవాట్లను వదులుకోవడం మంచిది. ఈ అలవాట్లను వదులుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట ఇంటిని కడగకూడదు- సూర్యాస్తమయం తర్వాత ఇంటిని రాత్రిపూట తొడవడం గాని ఉడవడం కానీ చేయకూడదు. దీని కారణంగా ఇంట్లో సంపద క్రమంగా తగ్గిపోతుంది. మీరు పేదరికంలో పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం తర్వాత ఇంటిని శుభ్రపరచకూడదు.

డబ్బులు ఇవ్వకూడదు- సూర్యాస్తమయం సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఆవాదవీలు చేయకూడదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీపైన రుణ భారం కూడా పెరగవచ్చు. దీనివల్ల మీరు మానసిక ఒత్తిడి కూడా గురవుతారు. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు.

Vastu Tips: తులసి మొక్కను ఈ ఒక్క రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి ...

రాత్రిపూట తిన్న గిన్నెలను వదిలేయవద్దు- రాత్రి భోజనం తర్వాత మిగిలిన పాత్రలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పడియ్యాలి అలాగే ఉంచడం వల్ల ఇంట్లో ధన కొరత ఏర్పడుతుంది. కాబట్టి మీరు పడుకునే ముందే తిన్న పాత్రలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

రాత్రిపూట బట్టలు ఉతకకూడదు- సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట దుస్తులను ఉతకడం అంత మంచిది కాదు. దీని వల్ల మీ ఇంట్లో ప్రతికూల పెరుగుతుంది. ఇంట్లో ఆనందం శాంతిని ఇది ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించాలి కాబట్టి మీరు రోజులో ఏ సమయంలోనైనా దుస్తులను ఉతకవచ్చు. కానీ రాత్రి పూట సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బట్టలను ఉతకవద్దు..

మంచం మీద తినడం- మంచం మీద కూర్చొని మంచం మీద కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలను సృష్టిస్తుంది. విభేదాలు పెరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.