Astrology: డిసెంబర్ 22 శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

విలాసవంతమైన జీవితం, సంపద, ప్రేమ ఇచ్చే వాడిగా శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 22 ఆదివారం శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విలాసవంతమైన జీవితం, సంపద, ప్రేమ ఇచ్చే వాడిగా శుక్రుడు ఉంటాడు. డిసెంబర్ 22 ఆదివారం శుక్రుడు ధనిష్ట నక్షత్రం లోనికి 11 గంటల 20 నిమిషాలకు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

మకర రాశి- మకర రాశి వారికి శుక్రుని సంచారం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. సొంత వ్యాపారులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది లాభాలను తీసుకువస్తుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. జీవితం ప్రశాంతంగా గడుస్తుంది భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.

Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి

కుంభరాశి- కుంభ రాశి వారికి శుక్రుని సంచారం అనేక శుభ ఫలితాలను తీసుకువస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలన్నీ తొలగిపోతాయి. పనిచేసే చోట మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు గౌరవం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పెడుతున్న చర్మ సమస్యల నుంచి బయటపడతారు. కాంట్రాక్ట్ ను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కొత్త కొత్త కాంట్రాక్టు లభిస్తాయి. వ్యాపారంలో నష్టాలు అన్ని తొలగిపోతాయి. ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులు తగ్గుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలు చదువుకోవాలని కల నెరవేరుతుంది. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి డిసెంబర్ చివరన అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. దుకాణదారిలో లాభాలు పెరుగుదల ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంది. వృద్ధులకు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం లో ప్రమోషన్ లభిస్తుంది. ఇది మీకు జీతాన్ని పెంచుతుంది కోర్టు సమస్యలు తొలగిపోతాయి. దీని ద్వారా మీకు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు సరదాగా గడపడానికి వెళతారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో చదువుకోవాలని కల నెరవేరుతుంది. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న సొంత ఇంటి కల నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif