Raksha Bandhan 2023: రాఖీ పండుగ రోజు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఇవే..ఈ తప్పులు చేశారో పుణ్యం బదులు పాపం తగలడం ఖాయం..
కావున మీరు కనుక ఈ రాఖీ పండగ రోజు పవిత్రంగా గడపాలని అనుకున్నట్లయితే, మాత్రం కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడే రాఖీ పండగ యొక్క ఫలితం మీకు లభిస్తుంది.
హిందువులందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగల్లో రాఖీ పండుగ ఒకటి. దీన్నే రక్షాబంధన్ అని కూడా అంటారు. రక్షాబంధన్ అనేది సోదర, సోదరీమణుల మధ్య ఉన్నటువంటి ప్రేమకు నిర్వచనం గా చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు రాఖీ చేతికి కట్టుకుంటారు. ఒక సోదరుడు తనకు రక్షగా ఉండాలని సోదరి అతని చేతికి రాఖీ కట్టడం అనేది వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే రాఖీ పండుగ పవిత్రమైన శ్రావణమాసంలో వస్తుంది కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనదిగా చెప్పవచ్చు. కావున మీరు కనుక ఈ రాఖీ పండగ రోజు పవిత్రంగా గడపాలని అనుకున్నట్లయితే, మాత్రం కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అప్పుడే రాఖీ పండగ యొక్క ఫలితం మీకు లభిస్తుంది.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
రాఖీ పండుగ రోజు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఇవే.
>> రాఖీ పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం భుజించరాదు. ఎందుకంటే శ్రావణమాసంలో మాంసాహారం భుజిస్తే పాపం తగులుతుందని పురాణాల్లో చెప్పారు కావున ఈరోజు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది
>> అదేవిధంగా రాఖీ పండగ రోజున గోవులను హింసించ రాదు ఒకవేళ అవి మన ఇంటి ముందుకు వచ్చిన ఆకలితో బయటకు పంపకూడదు గోవులకు మీకు వీలైనంత అన్నం లేక ఫలం లేదా తృణం పెట్టి పంపిస్తే మంచిది. అదేవిధంగా రాఖీ పండుగ రోజు ఎటువంటి జీవహింస చేయకూడదు కావున జాగ్రత్తగా ఉంటే మంచిది.