Happy Bathukamma 2024 Greetings: మీ బంధు మిత్రులకు ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిజేయండి..Whatsapp, Facebook ద్వారా షేర్ చేయండి..

బతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

bathukamma wishes

ఉయ్యాల పాటలు, కోలాటాల ఆటలు, చందమామల చప్పట్లు , తంగేడు పూల సోయగాలతో, గునుగు పూల గుభాలింతలతో, సీత జడల అందం, గోరింటల చందం, కట్ల పూల కలబోత తో బతుకమ్మ ను పేర్చి గుమ్మడి పువ్వు గౌరమ్మను నెత్తిన పెట్టుకొని కొలిచే తెలంగాణ వైభవం , తెలంగాణ సంస్కృతి కి ప్రతిరూపంగా నిలిచే తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ. బతుకు నిచ్చే బతుకమ్మ అంటే మన గౌరమ్మ, మన ఇంటి ఆడబిడ్డ, మన ఇలవేల్పు. తీరొక్క పూలతో మనసంతా పూల పరిమళమై పరుచుకున్న ఆడపడుచుల ఆత్మీయత ఈ బతుకమ్మ. బతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువుటద్దం, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ, ప్రకృతిని ఆరాధిస్తూ... పూలను పూజిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ  బతుకమ్మ.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే తెలంగాణ పండుగ బతుకమ్మ. ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక.

తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి బతుకమ్మను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. ఆశ్వయుజ అమావాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మగా సాగనంపడంతో ముగుస్తాయి

మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ.. బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.

bathukamma wishes

పువ్వులను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... పండగ, మన సంస్కృతి.. మన సాంప్రదాయానికి ప్రతీక... ఆడపడుచుల ఔన్నత్యానికి సూచిక.. తెలంగాణ ఆడపడుచులందరికీ... ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement